తెలంగాణ

telangana

ETV Bharat / business

రూ.4.3 లక్షల కోట్ల రుణాలు తీసుకోనున్న కేంద్రం

2020-21 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ. 4.3లక్షల కోట్ల రూణాలు తీసుకోనున్నట్టు ప్రకటించింది కేంద్ర ఆర్థికశాఖ. దీంతో సవరించిన లక్ష్యాన్ని చేరుకోనున్నట్టు వెల్లడించింది.

Govt to borrow Rs 4.34 lakh cr in second half of 2020-21
రూ. 4.3 లక్షల కోట్ల రుణాలు తీసుకోనున్న కేంద్రం

By

Published : Oct 1, 2020, 6:40 AM IST

2020-21 ఆర్థిక ఏడాది రెండో భాగంలో.. రూ. 4.34లక్షల కోట్ల రుణాలు తీసుకోనున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. కరోనా సంక్షోభం నేపథ్యంలో అవసరాల కోసమే ఈ చర్యల చేపట్టనున్నట్టు స్పష్టం చేసింది.

2020-21 బడ్జెట్​లో ఆమోదించిన రూ. 7.8లక్షల కోట్ల రుణాల లక్ష్యాన్ని.. 12లక్షల కోట్లకు సవరిస్తూ మే నెలలో కేంద్రం నిర్ణయం తీసుకుంది. తాజా ప్రకటనతో సవరించిన లక్ష్యాన్ని కేంద్రం చేరుకోనుంది.

"రూ. 12లక్షల కోట్లల్లో.. ఇప్పటికే రూ. 7.66 లక్షల కోట్ల రుణాలు తీసుకున్నాం. ఆర్థిక ఏడాది ఆరంభంలో అనుకున్న పూర్తిస్థాయి రుణాల్లో ఇది 63.83శాతం. అన్నిటిని దృష్టిలో పెట్టుకుని.. ఈ ఏడాది పూర్తి రుణాలను రూ. 12 లక్షల కోట్లుగానే ఉంచాలని కేంద్రం నిర్ణయించింది. అంటే ఈ ఆర్థిక సంవత్సరం రెండో భాగంలో రూ. 4.3లక్షల కోట్ల రుణాలు తీసుకుంటున్నట్టు అర్థం."

--- తరుణ్​ బజాజ్​, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి.

ఈ ఆర్థిక ఏడాది ప్రథమార్థం అంతా లాక్​డౌన్​లోనే గడిచిపోవడం వల్ల ఆదాయానికి గండిపడిందని తరుణ్​ వెల్లడించారు. అందుకే మే నెలలో.. రుణాల పరిమితిని పెంచినట్టు స్పష్టం చేశారు. అయితే జూన్​ నుంచి ఆర్థిక కార్యకలాపాలు సాగుతుండటం వల్ల ఆదాయం పెరిగిందన్నారు.

ఇదీ చూడండి:-బ్యాంకులకు రుణ పరిమితిని పొడిగించిన ఆర్​బీఐ

ABOUT THE AUTHOR

...view details