ఆడిట్ అవసరమైన కంపెనీలు 2019-20 ఆర్థిక సంవత్సర రిటర్ను దాఖలుకు మరోసారి గడువు పొడగించాలన్న డిమాండ్‌ను ఆర్థిక మంత్రిత్వ శాఖ తిరస్కరించింది. మళ్లీ గడువు పొడగింపు ప్రసక్తి లేదని తేల్చి చెప్పింది.
'ఐటీఆర్ దాఖలుకు ఇక గడువు పెంచేది లేదు'
2020-21 మదింపు సంవత్సరానికి.. ఆదాయపు పన్ను రిటర్ను (ఐటీఆర్) దాఖలు గడువుపై ఆర్థిక శాఖ కీలక ప్రకటన చేసింది. ఆడిట్ అవసరమైన కంపెనీలు రిటర్ను దాఖలు చేసేందుకు ఫిబ్రవరి 15 తర్వాత గడువు పెంచే ప్రసక్తి లేదని తేల్చి చెప్పింది.
ఐటీఆర్ దాఖలుకు గడువు పెంపు లేదు
నిజానికి కరోనా నేపథ్యంలో పలుమార్లు గడువు పొడిగించింది ఆర్థిక శాఖ. చివరి సారిగా గత నెల వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లింపుదారుల రిటర్ను దాఖలు గడువును డిసెంబర్ 31 నుంచి జనవరి 10కి పెంచింది. ఆడిట్ అవసరమైన కంపెనీల రిటర్నుల దాఖలు చేసేందుకు జనవరి 31గా ఉన్న తుది గడువును ఫిబ్రవరి 15 వరకు పొడిగించింది.
ఇదీ చూడండి:బ్యాంకుల బ్యాలెన్స్ షీట్లపై కొవిడ్ దెబ్బ