అవినీతి, విధుల్లో అలసత్వం వంటి ఆరోపణల నేపథ్యంలో 12 మంది ఆదాయపన్ను శాఖ సీనియర్ అధికారులను విధుల నుంచి తప్పించింది ప్రభుత్వం. వీరిలో జాయింట్ కమిషనర్ స్థాయి అధికారులు ఉండటం గమనార్హం.
జాయింట్ కమిషనర్ స్థాయి అధికారిపై ఓ వ్యాపారి నుంచి అక్రమ పన్ను వసూలు చేయడం సహా దివంగత ఆధ్యాత్మిక గురువు చంద్రస్వామికి సహాయం చేసినట్లు ఆరోపణలున్నాయి.
మహిళా అధికారులపై లైంగిక ఆరోపణల నేపథ్యంలో నోయిడాలో కమిషనర్(అప్పీల్) స్థాయి అధికారిని విధులనుంచి తప్పించింది ప్రభుత్వం. అధికార దుర్వినియోగంతో రూ.3.17 కోట్ల మేర అక్రమ స్థిర, చర ఆస్తులను పొందిన ఆరోపణలపై త్వరలో పదవీ విరమణ చేయాల్సిన అధికారిపై కొరడా ఝులిపించింది.
ఇతర అధికారులపై అక్రమ ఆస్తులు కూడబెట్టడం, తప్పుడు అనుమతులు మంజూరు చేయడం వంటి అవినీతి ఆరోపణలతో ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
ఇదీ చూడండి: 10 లక్షలకు మించి తీస్తే... వాత తప్పదు!