దేశంలో చమురు ధరలు ఆకాశాన్నంటాయి. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకం రూ. 8.5 వరకు తగ్గించే అవకాశం ప్రభుత్వం చేతుల్లో ఉందని నిపుణులు చెబుతున్నారు. సుంకం తగ్గించినా చమురుపై విధించే పన్ను ద్వారా వచ్చే ఆదాయాలపై ప్రభావం ఉండబోదని అంటున్నారు.
"ఎక్సైజ్ సుంకాలను తగ్గించకపోతే.. 2022 ఆర్థిక సంవత్సరంలో(ఏప్రిల్ 2021-మార్చి 2022) ప్రభుత్వ ఆదాయం రూ.4.35 లక్షల కోట్లుగా ఉంటుంది. ఇది ప్రభుత్వం 2021 బడ్జెట్లో అంచనా వేసిన రూ. 3.2 లక్షల కోట్ల ఆదాయం కన్నా ఎక్కువ. ఒకవేళ 2021 ఏప్రిల్ 1 లోగా లీటరు పెట్రోల్, డీజిల్పై రూ. 8.5 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినా.. ప్రభుత్వం అంచనా వేసిన ఆదాయం వస్తుంది" అని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ పేర్కొంది.