తెలంగాణ

telangana

ETV Bharat / business

ఉల్లి ధరలు తగ్గించేందుకు ఎగుమతులు బంద్​ - కేంద్రం

ఉల్లి ధరల కట్టడికి కేంద్రం మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించింది.

ఉల్లి ధరల అధుపు

By

Published : Sep 29, 2019, 3:12 PM IST

Updated : Oct 2, 2019, 11:15 AM IST

దేశంలో ఉల్లి ధరల అదుపునకు కేంద్రం చర్యలు ముమ్మరం చేసింది. ఉల్లిపాయల ఎగుమతిపై నిషేధం విధించింది. తక్షణమే ఈ ఆంక్షలు అమలులోకి వస్తాయని తెలిపింది.

అన్ని రకాల ఉల్లి ఎగుమతులపై నిషేధం అమలులోకి వచ్చిందని.. ప్రభుత్వం నుంచి తదుపరి ఆదేశాలు అందే వరకు ఎలాంటి ఎగుమతులు నిర్వహించరాదని విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్​​ స్పష్టం చేసింది.

ధరలు ఎందుకు పెరిగాయంటే..

ఉల్లి ఎక్కువగా పండే మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాల కారణంగా సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఫలితంగా దిల్లీ తదితర ప్రాంతాల రిటైల్ మార్కెట్లలో లభ్యత తగ్గి.. ఇటీవల కిలో ఉల్లి ధర రూ.60-80 దాటింది.

ఈ నేపథ్యంలో ధరలు తగ్గించాలని సామాన్యుల నుంచి డిమాండు పెరిగింది. విపణిలో లభ్యత పెంచేందుకు.. 50 టన్నుల సరుకును మార్కెట్​లోకి విడుదల చేసింది కేంద్రం.

ఇదీ చూడండి: జియో ఫైబర్​లోని ఈ రహస్య ఫీచర్లు తెలుసా...?

Last Updated : Oct 2, 2019, 11:15 AM IST

ABOUT THE AUTHOR

...view details