తెలంగాణ

telangana

ETV Bharat / business

టీకా రాకతో ఆర్థికవ్యవస్థ భారీ రికవరీ! - కరోనా టీకాపై ప్రపంచ బ్యాంక్ స్పందన

కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ ప్రాథమికంగా ప్రారంభమైన నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వృద్ధిపై వరల్డ్ బ్యాంక్ సానుకూల అంచనాలు విడుదల చేసింది. ఈ ఏడాది వృద్ధి రేటు 4 శాతంగా నమోదవ్వచ్చని ఆశాభావం వ్యక్తం చేసింది.

World Bank Forecast on Global Economy
ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై వరల్డ్ బ్యాంక్ అంచనాలు

By

Published : Jan 6, 2021, 7:36 PM IST

కరోనా ప్రభావం వల్ల 2020లో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది కాస్త కోలుకుంటుందని వరల్డ్ బ్యాంక్ ఆశాభావం వ్యక్తం చేసింది. ఇటీవల ప్రాథమికంగా ప్రారంభమైన కరోనా టీకా ప్రక్రియ.. ఏడాది చివరి నాటికి విస్తృతం అవుతుందని అంచనా వేసింది. ఈ సానుకూలతల నేపథ్యంలో 2021లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 4 శాతం వృద్ధి రేటును నమోదు చేసే అవకాశముందని పేర్కొంది.

అయితే కరోనా మహమ్మారి నుంచి గట్టెక్కేందుకు చర్యలు తీసుకోకపోతే, పెట్టుబడులు పెంచే దిశగా విధానకర్తలు సంస్కరణలు తీసుకురాకుంటే మాత్రం ఆర్థిక రికవరీ నెమ్మదిస్తుందని ప్రపంచ బ్యాంకు స్పష్టం చేసింది. ఈ మేరకు తాజాగా విడుదల చేసిన 'గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్' నివేదికలో పలు కీలక విషయాలు ప్రస్తావించింది.

భాారత్​పై అంచన ఇలా..

కరోనా మహమ్మారి ప్రభావంతో 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 9.6 క్షీణించవచ్చని అంచనా వేసింది వరల్డ్ బ్యాంక్. ఇది ప్రైవేటు పెట్టుబడులు, గృహ వ్యయాలలో తగ్గుదలను సూచిస్తోందని పేర్కొంది. అయితే.. 2021లో భారత్​ పుంజుకుని 5.4 శాతం వృద్ధి రేటు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది.

దక్షిణాసియా ప్రాంతం 2021లో 3.3 శాతం వృద్ధి రేటును కనబర్చే వీలుందని వరల్డ్ బ్యాంక్ తెలిపింది.

ఇదీ చూడండి:భారత ఆర్థిక వ్యస్థపై వరల్డ్ బ్యాంక్ తాజా అంచనాలు

ABOUT THE AUTHOR

...view details