తెలంగాణ

telangana

ETV Bharat / business

రికార్డు: నూతన గరిష్ఠానికి విదేశీ మారకం నిల్వలు - ఫారెక్న్​ నిల్వల గణాంకాలు

దేశీయంగా విదేశీ మారకం నిల్వలు ఈ వారం జీవనకాల గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. మొత్తం విదేశీ మారకం నిల్వలు 453.12 బిలియన్ డాలర్లకు చేరినట్లు ఆర్బీఐ గణాంకాలు చెబుతున్నాయి.

FOREX
విదేశీ మారకం నిల్వలు

By

Published : Dec 13, 2019, 8:02 PM IST

దేశంలో విదేశీ మారక నిల్వలు ఈ వారం రికార్డు స్థాయికి చేరుకున్నాయి. గత వారంతో పోలిస్తే.. 2.342 బిలియన్‌ డాలర్లు పెరిగి 453.12 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయని ఆర్బీఐ గణాంకాల్లో తెలిసింది.

గతవారం 2.48 బిలియన్‌ డాలర్లు పెరిగిన ఫోరెక్స్​ నిల్వలు.. 451.08 డాలర్లకు చేరుకున్నట్లు ఆర్బీఐ విడుదల చేసిన వార నివేదిక పేర్కొంది.

విదేశీ కరెన్సీ ఆస్తుల వృద్ధి కారణంగా నిల్వలు పెరిగినట్లు తెలుస్తోంది. మొత్తం నిల్వలలో ఇవే ప్రధానమైన భాగం. అటు ఈ వారంలో బంగారం నిల్వలూ 430 మిలియన్‌ డాలర్లు పెరిగి 27.07 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి.

ఇదీ చూడండి:నవంబర్​లో స్వల్పంగా తగ్గిన భారత ఎగుమతులు

ABOUT THE AUTHOR

...view details