తెలంగాణ

telangana

ETV Bharat / business

కొత్త పన్ను విధానానికే 80 శాతం మంది ఆసక్తి! - ఆదాయ పన్ను పాత శ్లాబులు

ఆదాయ పన్ను చెల్లింపునకు 80 శాతం మంది కొత్త పన్ను విధానాన్నే ఎంచుకునే వీలుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. 2020-21 వార్షిక బడ్జెట్​లో కేంద్రం ప్రకటించిన కొత్త శ్లాబుల ద్వారానే పన్ను ఆదా అవుతుందని చాలా మంది భావిస్తున్నట్లు తెలిపింది.

INCOMETAX
కొత్త పన్ను విధానానికే 80 శాతం మంది ఆసక్తి!

By

Published : Feb 7, 2020, 8:35 PM IST

Updated : Feb 29, 2020, 1:45 PM IST

ఆదాయ పన్ను చెల్లింపుదారుల్లో కనీసం 80 శాతం మంది కొత్తగా తీసుకువచ్చిన పన్ను చెల్లింపు విధానాన్ని ఎంచుకుంటారని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ భావిస్తున్నట్లు రెవెన్యూ కార్యదర్శి అజెయ్​ భూషణ్ పాండే తెలిపారు.

2020-21 బడ్జెట్​లో పన్ను చెల్లింపుల్లో శ్లాబ్​లను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం విధితమే.

పద్దుకు ముందే సర్వే..

పద్దు ప్రవేశ పెట్టే ముందే దేశవ్యాప్తంగా 5.78 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులపై కేంద్రం ఓ సర్వే నిర్వహించిందని పాండే తెలిపారు. ఇందులో కొత్త పన్ను విధానం ద్వారా పన్ను ఆదా అవుతుందని 69 శాతం మంది, పాత పద్ధతిలోనే మేలు జరుగుతుందని 11 శాతం మంది భావించినట్లు తెలిపారు.

మిగతా 20 శాతం మంది పన్ను చెల్లింపుదారులు పాత పద్ధతిలో ఎక్కువ పేపర్ వర్క్​ ఉన్నందున.. వారూ కొత్త విధానానికే మొగ్గుచూపే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. బడ్జెట్​లో ప్రవేశ పెట్టిన కొత్త విధానాన్ని పన్ను చెల్లింపుదారులు ఐచ్ఛికంగానే ఎంచుకునే అవకాశం ఇస్తున్నట్లు తెలిపారు.

కొత్త శ్లాబులు ఇలా..

  • 0 నుంచి 2.50 లక్షల వరకు ఎలాంటి ఆదాయపన్ను లేదు.
  • 2.50 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు 5 శాతం
  • రూ.5 లక్షలలోపు ఆదాయం ఉన్నవారికి పన్నులు యథాతథం
  • 5 లక్షల నుంచి 7.50 లక్షల వరకు 10 శాతం
  • 7.50 లక్షల నుంచి 10 లక్షల వరకు 15 శాతం
  • 10 లక్షల నుంచి 12.50 లక్షల వరకు 20 శాతం
  • 12.50 లక్షల నుంచి 15 లక్షల వరకు 25 శాతం
  • 15 లక్షలకు పైన ఆదాయం ఉన్నవారికి 30 శాతం

ఇదీ చూడండి:'ఈ-క్యాలిక్యులేటర్'​తో మీ పన్ను ఎంతో తెలుసుకోండి

Last Updated : Feb 29, 2020, 1:45 PM IST

ABOUT THE AUTHOR

...view details