తెలంగాణ

telangana

ETV Bharat / business

బడ్జెట్​ 2020​ : నిర్మలమ్మ బడ్జెట్​ విశేషాలివే - బడ్జెట్ 2020 ముఖ్యాంశాలు

Budget updates
ఉద్యానవన పంటల అభివృద్ధికి మరింత ప్రోత్సాహం

By

Published : Feb 1, 2020, 9:05 AM IST

Updated : Feb 28, 2020, 6:07 PM IST

14:05 February 01

లోక్​సభ వాయిదా

2020-21 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శనివారం ప్రవేశపెట్టారు. బడ్జెట్‌పై దాదాపు రెండున్నర గంటలకు పైగా సుదీర్ఘ ప్రసంగం చేసిన నిర్మల.. అనేక కీలక ప్రకటనలు చేశారు. వ్యవసాయాభివృద్ధి, విద్యా విధానాలకు అధిక ప్రాధాన్యం కల్పించారు. ఆదాయపు పన్ను శ్లాబుల్లో మార్పులు చేసినట్లు తెలిపారు. ఆర్థిక మంత్రి బడ్జెట్‌ ప్రసంగం అనంతరం లోక్‌సభ సోమవారానికి వాయిదా పడింది.

14:00 February 01

బడ్జెట్​ కేటాయింపులు ఇలా

  • గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, సాగునీటి రంగాలకు రూ.2.83 లక్షల కోట్లు
  • మౌలికరంగ ప్రాజెక్టులకు రూ.లక్షా 3 వేల కోట్లు
  • రవాణా, మౌలిక వసతుల అభివృద్ధికి రూ.1.7 లక్షల కోట్లు
  • విద్యారంగానికి రూ.99,300 కోట్లు
  • ఎస్సీలు, ఓబీసీలకు రూ.85 వేల కోట్లు కేటాయింపు
  • ఎస్టీల కోసం రూ.53 వేల కోట్లు కేటాయింపు
  • సీనియర్‌ సిటిజన్లు, దివ్యాంగుల కోసం రూ.9,500 కోట్లు
  • పౌష్టికాహార పథకం కోసం రూ.35,600 కోట్లు
  • మహిళలు, శిశువుల పౌష్టికాహారం కోసం రూ.28,600 కోట్లు
  • జమ్ముకశ్మీర్‌కు రూ.30,757 కోట్లు
  • లద్దాఖ్ ప్రాంతానికి రూ.5,958 కోట్లు
  • పరిశ్రమలు, వాణిజ్యం ప్రోత్సాహకానికి రూ.27,300 కోట్లు
  • బెంగళూరుకు రూ.18,600 కోట్లతో మెట్రో తరహా సబర్బన్‌ రైల్వే పథకం
  • స్వచ్ఛభారత్‌ మిషన్‌కు రూ.12,300 కోట్లు
  • జల్‌జీవన్‌ మిషన్‌కు రూ.11,500 కోట్లు
  • నేషనల్ మిషన్ ఫర్ క్వాంటమ్ టెక్నాలజీస్‌కు నాలుగేళ్లలో రూ.8 వేల కోట్లు
  • ప్రధాని జన ఆరోగ్య యోజనకు రూ.6,400 కోట్లు
  • నగరాల్లో కాలుష్య నియంత్రణకు రూ.4,400 కోట్లు
  • నైపుణ్యాభివృద్ధి కేంద్రాలకు రూ.3 వేల కోట్లు
  • పర్యాటకరంగ అభివృద్ధికి రూ.2 వేల కోట్లు కేటాయింపు
  • జౌళి రంగానికి రూ.1,480 కోట్లు
  • ప్రభుత్వరంగ బ్యాంకులకు 3.5 లక్షల కోట్ల మూలధన సాయం
  • డిపాజిటర్ల బీమా కవరేజ్‌ రూ.లక్ష నుంచి 5 లక్షలకు పెంపు
  • ఔషధ, విడిభాగాల పరిశ్రమల్లో ఎగుమతుల ప్రోత్సాహానికి రూ.వెయ్యి కోట్లు

13:26 February 01

'కొత్త ఆదాయ పన్ను విధానం ఐచ్ఛికం'

ఆదాయపన్ను శ్లాబుల్లో భారీ మార్పులు చేశారు. బడ్జెట్‌- 2020-21లో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆదాయం రూ.5 నుంచి 7.5లక్షలు ఉన్నవారికి 10శాతం పన్ను. రూ.7.5లక్షల నుంచి రూ.10లక్షల ఆదాయం ఉన్నవారికి 15శాతం పన్ను. రూ.10లక్షల నుంచి రూ12.5లక్షల వరకూ ఆదాయం ఆర్జించే వారికి 20శాతం పన్ను, 12.5లక్షలు నుంచి రూ.15లక్షలు ఆదాయ వర్గాలకు 25శాతం పన్ను వర్తిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో తెలిపారు. రూ.15లక్షలకు పైగా ఆదాయం ఉంటే 30శాతం పన్ను చెల్లించాల్సిందిగా పేర్కొన్నారు. కొత్త ఆదాయ పన్ను విధానం ఐచ్ఛికం అని తెలిపారు. మినహాయింపులు పొందాలా? వద్దా? అన్నది వేతన జీవుల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. దీంతో పాత విధానంతో పాటు కొత్త విధానమూ అమల్లో ఉంటుంది. కొత్త ట్యాక్స్‌ విధానం ఎంచుకుంటే 80(సి) కింద వచ్చే మినహాయింపులు రావు

13:07 February 01

ఆదాయపన్ను శ్లాబ్‌లో భారీ మార్పులు

  • ఆదాయపన్ను శ్లాబ్‌లో భారీ మార్పులు
  • మధ్య, ఎగువ మధ్యతరగతికి ఊరటనిచ్చేలా చర్యలు
  • ఆదాయపన్ను శ్లాబ్‌లు 4 నుంచి 7 శ్లాబ్‌లకు పెంపు
  • 0 నుంచి 2.50 లక్షల వరకు ఎలాంటి ఆదాయపన్ను లేదు
  • 2.50 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు 5 శాతం ఆదాయపన్ను
  • రూ.5 లక్షలలోపు ఆదాయం ఉన్నవారికి పన్నులు యథాతథం
  • 5 లక్షల నుంచి 7.50 లక్షల వరకు 10 శాతం ఆదాయపన్ను
  • 7.50 లక్షల నుంచి 10 లక్షల వరకు 15 శాతం ఆదాయపన్ను
  • 10 లక్షల నుంచి 12.50 లక్షల వరకు 20 శాతం ఆదాయపన్ను
  • 12.50 లక్షల నుంచి 15 లక్షల వరకు 25 శాతం ఆదాయపన్ను
  • 15 లక్షలకు పైనా ఆదాయం ఉన్నవారికి 30 శాతం ఆదాయపన్ను

12:52 February 01

జమ్ముకశ్మీర్​, లద్ధాఖ్​కు ప్రత్యేక కేటాయింపులు

  • గతేడాది జులై-డిసెంబర్‌ మధ్య తీవ్రమైన నగదు కొరత ఏర్పడింది
  • హెచ్‌ఎఫ్‌సీలు, ఎన్‌బీఎఫ్‌సీల నగదు కొరత తీర్చేందుకు చర్యలు
  • బ్యాంకింగ్‌ యేతర హౌసింగ్‌ ఫైనాన్స్‌ సంస్థలకు అదనపు నిధుల కేటాయింపునకు కొత్త పథకం
  • ప్రభుత్వ సెక్యూరిటీల పెట్టుబడులకు ఎన్‌ఆర్‌ఐలకు అవకాశం
  • ఆర్థిక ఒప్పందాల పర్యవేక్షణకు కొత్త చట్టం
  • రుణ పునర్‌వ్యవస్థీకరణతో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు లబ్ధి
  • ఔషధ, విడిభాగాల పరిశ్రమల్లో ఎగుమతుల ప్రోత్సాహానికి రూ.వెయ్యి కోట్లు
  • లద్దాఖ్ ప్రాంతానికి రూ.5,958 కోట్లు
  • జమ్ముకశ్మీర్‌కు రూ.30,757 కోట్లు
  • ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.3 లక్షల 50 వేల కోట్లు మూలధన సాయం
  • డిపాజిటర్ల సొమ్మును సురక్షితంగా ఉంచేందుకు తగిన చర్యలు
  • డిపాజిటర్ల బీమా కవరేజీని రూ.లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నాం
  • సఫాయీ కర్మచారి విధానానికి స్వస్తి
  • జాతీయ భద్రతకు అత్యధిక ప్రాధాన్యం
  • అవినీతి మరక లేని స్వచ్ఛమైన పాలన అందిస్తున్నాం
  • వ్యాపార వర్గాల్లో విశ్వాసం పెంపొందించే దిశగా పన్ను చెల్లింపు చార్టర్‌
  • పన్ను చెల్లింపుదారులపై వేధింపులకు స్వస్తిచెప్పే చర్యలు
  • పన్ను చెల్లింపుదారులపై ఉండే క్రిమినల్‌ శిక్షలు సివిల్‌ విధానంలో మార్పులకు చర్యలు
  • సివిల్‌ విధానంలో మార్పులకు త్వరలో చట్టసవరణ
  • నాన్‌గెజిటెడ్‌ పోస్టులకు జాతీయ స్థాయి రిక్రూట్‌మెంట్‌ ఏజన్సీ
  • ప్రభుత్వ రంగ సంస్థల్లో నాన్‌గెజిటెడ్‌ అధికారుల నియామకాల్లో సంస్కరణలు
  • త్వరలో జాతీయ స్థాయి ప్రవేశపరీక్ష నిర్వహణ
  • జాతీయస్థాయిలో ఆన్‌లైన్‌లోనే కామన్‌ ఎలిజబుటి టెస్టు ద్వారా నాన్‌గెజిటెడ్‌ అధికారుల నియామకం
  • దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ నాన్‌గెజిటెడ్‌ అధికారుల నియామక పరీక్ష కేంద్రాలు

12:45 February 01

నగర కాలుష్య నియంత్రణకు రూ.4,400 కోట్లు

  • వాతావరణ మార్పులను ఎదుర్కోవడం, పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం
  • పారిస్‌ ఒప్పందానికి అనుగుణంగా కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకుంటన్నాం
  • 10 లక్షల జనాభా దాటిన పెద్ద నగరాల్లో స్వచ్ఛమైన గాలి లభ్యత కష్టంగా మారింది
  • నగరాల్లో కాలుష్య నియంత్రణకు రూ.4,400 కోట్లు
  • పాత థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు తమ కర్బన ఉద్గారాలు తగ్గించుకోవాలి
  • రాంచీలో గిరిజన పురావస్తు ప్రదర్శనశాల

12:26 February 01

ఎస్టీలకు రూ.53 వేలు, ఎస్సీ-ఓబీసీలకు రూ.85 వేల కోట్లు

నేషనల్ మిషన్ ఫర్ క్వాంటమ్ టెక్నాలజీస్‌కు రూ.8 వేల కోట్లు. రానున్న నాలుగేళ్లకు రూ.8 వేల కోట్లు ఖర్చు చేస్తాం. ఎస్సీలు, ఓబీసీల కోసం రూ.85 వేల కోట్లు కేటాయింపు. ఎస్టీల కోసం రూ.53 వేల కోట్లు కేటాయింపు. సీనియర్‌ సిటిజన్లు, దివ్యాంగుల కోసం రూ.9,500 కోట్లు. వారసత్వ పరిరక్షణకు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెరిటేజ్‌ అండ్‌ కన్జర్వేషన్‌. 5 పురావస్తు కేంద్రాల ఆధునీకరణ, అభివృద్ధి. హరియాణాలోని రాఖీగడ, యూపీలోని హస్తినాపూర్‌ అభివృద్ధి. అసోంలోని శివసాగర్‌, గుజరాత్‌లోని డోలావీర. తమిళనాడులోని ఆదిత్య నల్లూరు అభివృద్ధి. పర్యాటక రంగ అభివృద్ధికి రూ.2 వేల కోట్లు

12:20 February 01

బేటీబచావో బేటీపడావో గొప్ప విజయం

బేటీబచావో బేటీపడావో గొప్ప విజయాన్ని సాధించింది. బేటీబచావో బేటీపడావో పథకం ద్వారా దేశవ్యాప్తంగా అన్ని స్థాయిల్లో ఆడపిల్లల సంఖ్య పెరిగింది. పాఠశాల స్థాయి నుంచి ఉన్నతస్థాయి విద్య వరకు బాలికలు ముందంజలో ఉన్నారు. పౌష్టికాహార పథకం కోసం రూ.35,600 కోట్లు. మహిళలు, శిశువులకు పౌష్టికాహారం అందించేందుకు రూ.28,600 కోట్లు. 

12:15 February 01

ముంబయి-అహ్మదాబాద్​ మధ్య హైస్పీడ్​ రైలు

చెన్నై-బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌ హైవే. 2వేల కి.మీ. హైవేల నిర్మాణమే లక్ష్యం. బెంగళూరుకు రూ.18,600 కోట్లతో మెట్రో తరహా  సబర్బన్‌ రైల్వే వ్యవస్థ. కేంద్రం 20శాతం, అదనపు నిధుల ద్వారా 60శాతం సమీకరణ. రైలు మార్గాల ఇరు పక్కల సోలార్‌ కేంద్రాల ఏర్పాటు. పర్యాటక కేంద్రాలతో తేజస్‌ రైళ్లు. 11వేల కిలోమీటర్ల మేర రైల్వే మార్గాల విద్యుదీకరణ. ముంబయి-అహ్మదాబాద్‌ మధ్య హైస్పీడ్‌ రైలు. 

ఎలక్ట్రానిక్‌ పరికరాల తయారీకి పెట్టుబడులు అవసరం. సెల్‌ఫోన్లు, సెమీ కండక్టర్లు, వైద్య పరికరాల ఉత్పత్తి ప్రోత్సాహానికి ఒక నూతన పథకం. ప్రతి జిల్లాను ఎగుమతి కేంద్రంగా మారుస్తాం. జాతీయ మౌలిక సదుపాయాల్లో భాగంగా ₹1.03లక్షల కోట్లు.

12:05 February 01

జౌళిరంగానికి రూ.1480 కోట్లు, రవాణా, మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.1.7 లక్షల కోట్లు

  • ప్రతి జిల్లా ఒక ఎక్స్‌పోర్ట్‌ హబ్‌గా రూపొందించాలనేది ప్రధాని ఆలోచన
  • ఎక్స్‌పోర్ట్‌ శ్రేణి ఉత్పత్తుల పరిశ్రమకు రాయితీలు
  • అంతర్జాతీయ వాణిజ్యం ఎగుమతుల ప్రోత్సాహకానికి ప్రత్యేక మండళ్లు ఏర్పాటు
  • రాష్ట్రాల స్థాయిలో విద్యుత్‌ బిల్లులు, రవాణా వ్యయాలు, వ్యాట్‌, ఇతర పన్నులకు సంబంధించి ఊరటనిచ్చేలా చర్యలు
  • దేశీయ మొబైల్‌ తయారీ పరిశ్రమలకు ప్రోత్సాహకాలు
  • త్వరలో జాతీయ సరకు రవాణా విధానం
  • 2 వేల కిలోమీటర్ల వ్యూహాత్మక రహదారులు
  • ఓడరేవులకు అనుసంధానం చేసే రహదారుల అభివృద్ధి
  • పరిశ్రమలు, వాణిజ్యం ప్రోత్సాహకానికి రూ.27,300 కోట్లు
  • బెంగళూరు నగరానికి రూ.18,600 కోట్లతో మెట్రో తరహా సబర్బన్‌ రైల్వే పథకం
  • 20 శాతం కేంద్రం, అదనపు నిధుల ద్వారా 60 శాతం సమకూరుస్తుంది
  • 11 వేల కిలోమీటర్ల మేర రైల్వే మార్గాలు విద్యుదీకరణ
  • రైల్వే ట్రాక్‌ల వెంబడి భారీ సోలార్ విద్యుత్ కేంద్రాలు
  • ముంబయి-అహ్మదాబాద్‌ మధ్య హైస్పీడ్‌ రైలు
  • పర్యాటక రంగ ప్రోత్సాహకానికి త్వరలో మరిన్ని తేజస్‌ రైళ్లు
  • రవాణా, మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.1.7 లక్షల కోట్లు
  • ప్రతి గడపకు విద్యుత్‌ తీసుకెళ్లడం అతిపెద్ద విజయం
  • నదీతీరాల వెంబడి అభివృద్ధి కార్యకలాపాలకు ప్రోత్సాహం
  • విద్యుత్‌ రంగంలో వచ్చే మూడేళ్లలో దేశవ్యాప్తంగా ప్రీపెయిడ్‌ మీటర్లు
  • నేషనల్‌ గ్యాస్‌ గ్రిడ్‌ను 16,300 కి.మీ. నుంచి 27 వేల కి.మీ.లకు పెంచే దిశగా చర్యలు
  • లక్షా 3 వేల కోట్లతో మౌలిక రంగ ప్రాజెక్టులు ప్రారంభం
  • దేశవ్యాప్తంగా డేటా సెంటర్‌ పార్కుల ఏర్పాటుకు నిర్ణయం
  • ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింక్స్‌, ఫైనాన్షియల్‌ టెక్నాలజీలో నూతన సంస్కరణకు మరిన్ని చర్యలు
  • లక్ష గ్రామాలకు ఓఎఫ్‌సీ ద్వారా డిజిటల్‌ కనెక్టివిటీ
  • జాతీయ గ్రిడ్‌తో లక్ష గ్రామాలకు అనుసంధానం
  • 2024 నాటికి దేశంలో కొత్తగా 100 విమానాశ్రయాలు

12:04 February 01

విదేశీ విద్యార్థుల కోసం 'ఇండ్‌శాట్‌’

భారత్‌లో చదవాలనుకునే విదేశీ విద్యార్థులకు స్టడీ ఇన్‌ ఇండియా ప్రోగ్రాం ‘ఇండ్‌శాట్‌’. త్వరలో కొత్త విద్యా విధానం. విద్యా రంగంలో విదేశీ పెట్టుబడులకు ఆహ్వానం. నేషనల్‌ పోలీస్‌ వర్సిటీ, నేషనల్‌ ఫోరెన్సిక్‌ వర్సిటీ ఏర్పాటు. 2026 నాటికి 150 యూనివర్సిటీల్లో కొత్త కోర్సులు. జిల్లా ఆస్పత్రులతో మెడికల్‌ కాలేజీల అనుసంధానం. 

11:58 February 01

విద్యారంగానికి రూ.99,300 కోట్లు

  • ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు మరింత ప్రోత్సాహం
  • ఉద్యోగాల కోసం వెంపర్లాడకుండా ఉద్యోగాల కల్పనకు ముందుకొచ్చేలా యువతకు ప్రోత్సాహం
  • పెట్టుబడి పెట్టే ముందు తగిన శిక్షణ,అవకాశాలపై అవగాహన కల్పించే కేంద్రాలు
  • నూతన పెట్టుబడులకు మార్గం సుగమం చేసేందుకు ప్రత్యేక విభాగం
  • ఎలక్ట్రానిక్స్‌ తయారీ రంగానికి ఊతమిచ్చేందుకు కొత్త పథకాలు
  • మొబైల్‌ ఫోన్ల తయారీ,సెమీ కండక్టర్ల పరిశ్రమల కోసం ప్రత్యేక పథకం,త్వరలో విధివిధానాలు
  • రాష్ట్రాల భాగస్వామ్యంతో కొత్తగా5ఆకర్షణీయ నగరాలు
  • జౌళి పరిశ్రమ మరింత అభివృద్ధికి త్వరలో ప్రత్యేక విభాగం
  • జాతీయ జౌళి సాంకేతికత మిషన్‌ ద్వారా కొత్త పథకం
  • ఈ ఏడాది నుంచి ఎగుమతిదారులకు ప్రోత్సాహక పథకం
  • చిన్నతరహా ఎగుమతిదారులకు రక్షణగా నిర్విక్‌ పేరుతో కొత్త బీమా పథకం
  • 2030నాటికి అత్యధికంగా పనిచేయగలిగిన యువత ఉండే దేశంగా భారత్‌
  • దేశవ్యాప్తంగా స్థానిక సంస్థల్లో ఇంజినీరింగ్‌ విద్యార్థులకు అప్రెంటీస్‌ విధానం
  • దేశంలో వైద్య నిపుణుల కొరత తీర్చేందుకు కొత్త విధానం
  • ప్రతి జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రికి అనుబంధంగా పీపీపీ విధానంలో వైద్య కళాశాలలు ఏర్పాటు
  • భూమి,సౌకర్యం కల్పించే రాష్ట్రాలకు కేంద్రం నుంచి సాయం
  • వైద్య పీజీ కోర్సుల కోసం పెద్దాస్పత్రులకు ప్రోత్సాహం
  • విద్యారంగంలో మార్పుల కోసం ప్రత్యేక నూతన విద్యా విధానం
  • 2026కల్లా150వర్సిటీల్లో కొత్త కోర్సులు
  • విద్యారంగానికి రూ.99,300కోట్లు
  • నైపుణ్యాభివృద్ధి కేంద్రాలకు రూ.3వేల కోట్లు
  • వర్సిటీలో కోసం త్వరలో జాతీయ స్థాయి విధానం
  • ఉపాధ్యాయులు,పారా మెడికోల కొరత తీర్చేలా నూతన విధానం

11:48 February 01

  • మిషన్‌ ఇంధ్రధనుస్సు ద్వారా టీకాలు
  • ఆరోగ్య పరిరక్షణకు స్వచ్ఛభారత్‌ ద్వారా కొత్త పథకాలు
  • ఆయుష్మాన్‌ భారత్‌ పథకం ద్వారా ప్రతిఒక్కరికీ ఆరోగ్యం
  • ఆయుష్మాన్‌ భారత్‌ పథకంలో రాని ఆస్పత్రులను ఈ పరిధిలోకి తీసుకొస్తాం
  • టీబీ హరేగా దేశ్‌ బచేగా పేరుతో క్షయ వ్యాధి నివారణకు ప్రత్యేక కార్యక్రమం
  • క్షయవ్యాధి నిర్మూలనతోనే దేశ విజయం
  • బహిరంగ మల విసర్జన రహిత దేశంగా భారత్‌
  • ఓడీఎఫ్‌ ప్లస్‌ ద్వారా పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యం
  • స్వచ్ఛభారత్‌ మిషన్‌కు రూ.12,300 కోట్లు
  • జల్‌జీవన్‌ మిషన్‌కు రూ.11,500 కోట్లు
  • ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకానికి రూ.6,400 కోట్లు
  • ఆరోగ్య రంగానికి రూ.69 వేల కోట్లు

11:42 February 01

ఉద్యానవన పంటల అభివృద్ధికి మరింత ప్రోత్సాహం

  • కేంద్ర, రాష్ట్రాలు కలిసి ఉద్యాన పంటలకు అదనపు నిధుల కేటాయింపులు
  • ఉద్యాన పంటల కోసం ప్రత్యేక క్లస్టర్లు ఏర్పాటు
  • పశువుల్లో కృత్రిమ గర్భదారణకు అదనపు సౌకర్యాలు
  • పాల ఉత్పత్తుల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు కృషి
  • రానున్న ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ రుణాల లక్ష్యం రూ.15 లక్షల కోట్లు
  • ఆల్గే, సీవీ కేజ్‌ కల్చర్‌ విధానంలో మత్స్య పరిశ్రమ అభివృద్ధికి ప్రోత్సాహకాలు
  • కోస్తా ప్రాంతాల్లోని గ్రామీణ యువతకు మత్స్య పరిశ్రమలో మరింత ఉపాధి
  • 3,400 సాగర్‌మిత్రలు ఏర్పాటు
  • గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, సాగునీరు, అనుబంధ రంగాలకు రూ.2.83 లక్షల కోట్లు

11:35 February 01

మరో 20 లక్షల మందికి సోలార్‌ పంప్‌సెట్ల పథకం

నీటి కొరత తీవ్రంగా ఉంది. 100 జిల్లాల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. రైతులకు సోలార్‌ పంప్‌సెట్ల పథకాన్ని  మరో 20 లక్షల మంది కర్షకులకు విస్తరిస్తున్నాం. సాగులేని భూముల్లో సోలార్‌ కేంద్రాలతో రైతులకు ఆదాయం వస్తుంది. వేల సంవత్సరాల క్రితమే తమిళ మహాకవి అవ్వయ్యార్‌ నీటి సంరక్షణ, భూమి వినియోగం గురించి వెల్లడించారు. 

11:30 February 01

ధాన్యలక్ష్మి పథకం అమలు

  • వర్షాభవ జిల్లాలకు అదనపు నిధులు
  • సౌగునీటి సౌకర్యాలు కల్పించేలా ప్రాధాన్యం
  • రైతులకు 20 లక్షల సోలార్‌ పంపుసెట్లు
  • బీడు భూముల్లో సోలార్‌ విద్యుత్‌ కేంద్రాల ఏర్పాటుకు పెట్టుబడి సాయం
  • రైతులకు రసాయనిక ఎరువుల నుంచి విముక్తి
  • భూసార రక్షణకు అదనపు సాయం, సంస్కరణలు
  • రైతులకు సహాయంగా గోదాముల నిర్మాణం
  • గోదాముల నిర్మాణానికి నాబార్డు ద్వారా సాయం
  • పీపీపీ పద్ధతిలో ఎఫ్‌సీఐ, కేంద్ర గిడ్డంగుల సంస్థ సంయుక్తంగా గోదాముల నిర్మాణం
  • మహిళా స్వయంసహాయక సంఘాల ద్వారా ధాన్యలక్ష్మి పథకం అమలు
  • ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు నాబార్డు ద్వారా ఎస్‌ఎస్‌జీలకు సాయం
  • కూరగాయల సరఫరాకు కృషి ఉడాన్‌ యోజన
  • కూరగాయలు, పండ్లు, పూలు ఎగుమతులు, రవాణాకు ప్రత్యేక విమానాల వినియోగం
  • ఉద్యానవన పంటల అభివృద్ధికి మరింత ప్రోత్సాహం
  • కేంద్ర, రాష్ట్రాలు కలిసి ఉద్యాన పంటలకు అదనపు నిధుల కేటాయింపులు

11:26 February 01

2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు

న్యూఇండియా, సబ్‌కా సాత్‌, సబ్‌కా వికాస్‌, ప్రజా సంక్షేమం అనే మూడు లక్ష్యాలతో ముందుకు వెళ్తున్నాం.

  • 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపునకు కట్టుబడి ఉన్నాం
  • ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన ద్వారా 6.11 కోట్ల మంది రైతులకు ప్రయోజనం
  • పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణం పెంచడంపై దృష్టి సారించాం
  • కృషి సించాయి యోజన ద్వారా సూక్ష్మ సాగునీటి విధానాలకు ప్రోత్సాహం
  • గ్రామీణ సడక్‌ యోజన, ఆర్థిక సమ్మిళిత రైతులకు ఎంతో మేలు చేస్తున్నాయి
  • పొలాలు, రైతుల ఉత్పాదకత పెంచడం ద్వారా ప్రయోజనం

11:23 February 01

మూడు ప్రాధాన్యాంశాలతో ముందుకు

  • మొదటి ప్రాధాన్యాంశం: వ్యవసాయం, సాగునీరు గ్రామీణాభివృద్ధి
  • ద్వితీయ ప్రాధాన్యాంశం: ఆరోగ్యం, పారిశుద్ధ్యం, తాగునీరు
  • మూడో ప్రాధాన్యాంశం: విద్య, చిన్నారుల సంక్షేమం

11:20 February 01

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తేనే

నిర్మాణాత్మక చర్యలతో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ముందడుగు వేస్తున్నాం. కేంద్ర, రాష్ట్రాలు కలిసి పనిచేస్తేనే దేశం వేగంగా ముందుకెళ్తుంది. సబ్‌కా సాత్‌ సబ్‌కా వికాస్‌ సబ్‌కా విశ్వాస్‌ ఈ ప్రభుత్వ లక్ష్యం. ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయి నేరుగా నిరుపేదలకు అందించేందుకు ప్రయత్నం.

11:17 February 01

భారత్​ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ

గత ఎన్నికల్లో మోదీ ప్రభుత్వానికి భారీ మెజార్టీతో అధికారం అప్పగించారు. దార్శనికులైన అరుణ్‌జైట్లీకి నివాళి. ఆదాయాల పెంపు, కొనుగోలు శక్తి పెంచే దిశగా బడ్జెట్‌. యువతను మరింత శక్తిమంతం చేసేలా ప్రభుత్వ ప్రాధమ్యాలు ఉంటాయి. జీఎస్టీతో రాష్ట్రాల, కేంద్రం ఆదాయం పెరిగింది. ఎవరికీ నష్టం కలగలేదు. ఒకే పన్ను, ఒకే దేశం విధానం మంచి ఫలితాన్ని ఇచ్చింది. 

ఏప్రిల్‌ నుంచి పన్ను చెల్లింపులు మరింత సరళతరం

ఇన్‌స్పెక్టర్‌ రాజ్‌కు కాలం చెల్లింది. ఇందులో భాగంగా అనేక చెక్‌పోస్టులు తొలగించాం. దాదాపు 10శాతం పన్ను భారం తగ్గింది. గత రెండేళ్లలో 16లక్షల పన్ను చెల్లింపుదారులు కొత్తగా చేరారు. ఏప్రిల్‌ 2020 నుంచి పన్ను చెల్లింపులు మరింత సరళతరం అవుతాయి.

11:14 February 01

జీఎస్టీతో సామాన్యులకు నెలవారీ ఖర్చులు 4 శాతం ఆదా

  • జీఎస్టీలోని సమస్యల పరిష్కారానికి జీఎస్టీ కౌన్సిల్‌ వేగంగా పనిచేస్తోంది
  • కొత్తగా 60 లక్షలమంది ఆదాయపన్ను చెల్లింపుదారులు చేరారు
  • 40 లక్షలమంది కొత్తగా ఐటీ రిటర్న్‌లు దాఖలు చేశారు
  • సబ్‌కా సాత్‌ సబ్‌కా వికాస్‌ సబ్‌కా విశ్వాస్‌ ఈ ప్రభుత్వ లక్ష్యం
  • ప్రభుత్వం ఖర్చుచేసే ప్రతి రూపాయి నిరుపేదలకు నేరుగా అందించే ప్రయత్నం జరుగుతోంది

11:12 February 01

ఆర్థిక మంత్రి ప్రసంగం అప్​డేట్స్​

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ 2020-21 బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఇది సామాన్యుల బడ్జెట్‌ అని అభివర్ణించారు.

  • 2019 మే ఎన్నికల్లో మోదీ నాయకత్వానికి భారీ మెజారిటీతో ప్రజలు అధికారం అప్పగించారు
  • ప్రజలు ఇచ్చిన తీర్పుతో పునరుత్తేజంతో మోదీ నాయకత్వంలో భారత అభివృద్ధికి పనిచేస్తున్నాం
  • ఆదాయాల పెంపు, కొనుగోలు శక్తి పెంచే దిశగా బడ్జెట్‌
  • యువతను మరింత శక్తిమంతం చేసే దిశగా ప్రభుత్వ ప్రాధమ్యాలు ఉంటాయి
  • సమాజంలో అట్టడుగు వర్గాల వారికి ఆర్థిక స్వావలంబన కల్పించే దిశగా చర్యలు
  • ఆర్థిక వ్యవస్థ మూలాలు బలంగా ఉన్నాయి, ద్రవ్యోల్బణం అదుపులో ఉంది
  • నిర్మాణాత్మక చర్యలతో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ముందడుగు వేస్తున్నాం
  • కేంద్ర, రాష్ట్రాలు కలిసి పనిచేస్తేనే దేశం వేగంగా ముందుకెళ్తుంది
  • జీఎస్టీ ప్రవేశపెట్టాక దేశవ్యాప్తంగా పన్ను విధానంలో పారదర్శకత నెలకొని ఉంది
  • చెక్‌పోస్టుల విధానానికి చెక్‌ పెట్టి కొత్త ఆర్థిక వ్యవస్థకు నాంది పలికాం

11:07 February 01

ఇది సామాన్యుల బడ్జెట్‌

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ లోక్​సభలో బడ్జెట్​ ప్రవేశపెట్టారు. అనంతరం బడ్జెట్​పై ప్రసంగాన్ని ప్రారంభించారు.

11:04 February 01

లోక్​సభ ముందుకు బడ్జెట్​

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ లోక్​సభలో బడ్జెట్​ ప్రవేశపెట్టారు. అనంతరం బడ్జెట్​పై ప్రసంగాన్ని ప్రారంభించారు.

10:53 February 01

బడ్జెట్​కు మంత్రివర్గం పచ్చజెండా

బడ్జెట్​కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మరికాసేపట్లే లోక్​సభలో ప్రవేశపెట్టనున్నారు నిర్మల

10:40 February 01

'అమ్మ' బడ్జెట్​ వినేందుకు పార్లమెంట్​కు 'కూతురు'

కేంద్రబడ్జెట్‌ను రెండోసారి ప్రవేశపెడుతున్న తొలి మహిళగా ఘనత సాధించారు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌. గత బడ్జెట్‌ మాదిరిగానే ఈ సారి కూడా పద్దుల సంచీతో పార్లమెంట్‌కు వచ్చిన ఆమె బడ్జెట్‌ ప్రవేశపెట్టబోతున్నారు. కాగా.. నిర్మలమ్మ బడ్జెట్‌ వినేందుకు ఆమె కుమార్తె వాంగ్మయి కూడా పార్లమెంట్‌కు వచ్చారు. ఆమెతో పాటు నిర్మల కుటుంబసభ్యులు కూడా విచ్చేశారు. పార్లమెంట్‌ సిబ్బంది, అధికారులు వీరిని సాదరంగా ఆహ్వానించి లోనికి తీసుకెళ్లారు.

10:27 February 01

పార్లమెంట్​కు ప్రధాని, కేంద్ర హోంమంత్రి

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్​ షా పార్లమెంట్​కు చేరుకున్నారు. మంత్రివర్గ భేటీలో పాల్గొని బడ్జెట్​కు ఆమోదం తెలపనున్నారు. 

10:20 February 01

పార్లమెంట్​కు బడ్జెట్​ ప్రతులు

బడ్జెట్​ ప్రతులు పార్లమెంట్​కు చేరుకున్నాయి. కేంద్రమంత్రి వర్గం ఆమోదం అనంతరం మరికాసేపట్లో బడ్జెట్​ను పార్లమెంట్​లో ప్రవేశపెట్టనున్న నిర్మల

10:10 February 01

పార్లమెంట్​కు ఆర్థిక మంత్రి 'నిర్మల'

దేశంలోని ఉద్యోగులకు ఉపశమనం కలిగించేలా, గ్రామీణ ప్రాంతాల్లో పెట్టుబడులకు ఊతమిచ్చేలా కేంద్ర వార్షిక బడ్జెట్​ ఉంటుందని కాంగ్రెస్ పార్టీ ఆశాభావం వ్యక్తం చేసింది. 

10:07 February 01

'ఉద్యోగులకు ఉపశమనం కలిగించేలా బడ్జెట్​'

బడ్జెట్​ ప్రతులను తీసుకొచ్చే సూట్​కేసు​ సంప్రదాయానికి క్రితంసారి స్వస్తి పలికిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​. ఈ ఏడాది అదే సంప్రదాయాన్ని కొనసాగించారు. ఎర్రటి వస్త్రంలో బడ్జెట్​ ప్రతులను తీసుకుని పార్లమెంట్​కు బయలుదేరారు.

పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి: ఎర్రటి వస్త్రంలోనే బడ్జెట్​ ప్రతులు.. పార్లమెంట్​కు సీతమ్మ

09:55 February 01

ఎర్రటి వస్త్రంలోనే బడ్జెట్​ ప్రతులు

బడ్జెట్​ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ బృందం.. రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ను కలిసింది. అనంతరం పార్లమెంట్​లో జరగబోయే కేంద్ర మంత్రివర్గ సమావేశానికి హాజరవుతారు.

09:50 February 01

రాష్ట్రపతిని కలిసిన నిర్మల బృందం

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​.. తన కార్యాలయం నుంచి పార్లమెంటుకు బయల్దేరారు. ఉదయం 11గంటలకు లోక్‌సభలో 2020-21 వార్షిక ఏడాది పద్దు ప్రవేశపెట్టనున్నారు.

09:42 February 01

పార్లమెంట్​కు బయలుదేరిన ఆర్థికమంత్రి

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​.. తన కార్యాలయం నుంచి పార్లమెంటుకు బయల్దేరారు. ఉదయం 11గంటలకు లోక్‌సభలో 2020-21 వార్షిక ఏడాది పద్దు ప్రవేశపెట్టనున్నారు.

09:32 February 01

సవాళ్ల ముంగిట స్వప్నాలు సాకారమయ్యేనా?

2020-21 కేంద్ర వార్షిక బడ్జెట్ సందర్భంగా మరికాసేపట్లో కేంద్ర మంత్రి వర్గం భేటీ కానుంది. ఉదయం 10.15 గంటలకు ప్రధాని అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది.

09:23 February 01

మరికాసేపట్లో కేంద్ర మంత్రివర్గ భేటీ

బడ్జెట్ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్​ను కలవనున్నారు. మరికాసేపట్లో ఆర్థికశాఖ బృందంతో మర్యాదపూర్వకంగా భేటీ అవుతారు.

09:17 February 01

మరికాసేపట్లో రాష్ట్రపతిని కలవనున్న నిర్మల బృందం

నేడు కేంద్రం పార్లమెంట్​లో బడ్జెట్​ ప్రవేశపెట్టనుంది. ఈ తరుణంలో అందరూ దీని గురించే చర్చించుకుంటున్నారు. వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న తొలి పూర్తిస్థాయి బడ్జెట్​ ఇది. సామాన్యులకు ఎలాంటి వరాలు కురిపించనుంది..? రైతుల కోసం ఏం చేస్తుంది..? వంటి ప్రశ్నలపై రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ విషయాలు పక్కన పెడితే.. బడ్జెట్​ అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది.. ఆర్థిక శాఖ మంత్రి చేతిలోని సూట్​కేసు.

మరి ఆ సూట్​కేసు చరిత్ర ఏమిటో తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి : పద్దు 2020: బడ్జెట్​ సూట్​కేస్ చరిత్ర తెలుసా?

09:11 February 01

ఇదీ బడ్జెట్ సూట్​కేసు​ చరిత్ర

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ దిల్లీలోని ఆర్థికశాఖ కార్యాలయానికి చేరుకున్నారు. మరికాసేపట్లో పార్లమెంట్​లో వార్షిక బడ్జెట్​ ప్రవేశపట్టారు.

09:06 February 01

ఆర్థికశాఖ కార్యాలయానికి నిర్మలా సీతారామన్​

ఎన్డీఏ 2.0 ప్రభుత్వం తొలి పూర్తిస్థాయి బడ్జెట్​ను మరికాసేపట్లో ప్రవేశపెట్టనుంది. లోక్​సభ ఎన్నికల అనంతరం.. రాష్ట్రాల ఎన్నికల్లో డీలా పడిపోయిన భాజపాకు ఈ పద్దు ఎంతో కీలకం. అయితే.. మందగమనం నేపథ్యంలో ప్రజాకర్షణ మంత్రం జపించేందుకు అసలు అవకాశముందా? వ్యవసాయం, బ్యాంకింగ్​, రక్షణ, విద్య, వైద్యం తదితర రంగాల్లో ఎలాంటి సంస్కరణలు చేపట్టొచ్చు..?

పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి : నేడే కేంద్ర వార్షిక బడ్జెట్​.. ప్రజా సంక్షేమానికి పెద్దపీట!

07:57 February 01

బడ్జెట్ లైవ్​ అప్​డేట్స్​ : పార్లమెంట్​కు పద్దు ప్రతులు

ఎన్డీఏ 2.0 ప్రభుత్వం తొలి పూర్తిస్థాయి బడ్జెట్​ను మరికాసేపట్లో ప్రవేశపెట్టనుంది. లోక్​సభ ఎన్నికల అనంతరం.. రాష్ట్రాల ఎన్నికల్లో డీలా పడిపోయిన భాజపాకు ఈ పద్దు ఎంతో కీలకం. అయితే.. మందగమనం నేపథ్యంలో ప్రజాకర్షణ మంత్రం జపించేందుకు అసలు అవకాశముందా? వ్యవసాయం, బ్యాంకింగ్​, రక్షణ, విద్య, వైద్యం తదితర రంగాల్లో ఎలాంటి సంస్కరణలు చేపట్టొచ్చు..?

పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి : నేడే కేంద్ర వార్షిక బడ్జెట్​.. ప్రజా సంక్షేమానికి పెద్దపీట!

Last Updated : Feb 28, 2020, 6:07 PM IST

ABOUT THE AUTHOR

...view details