తెలంగాణ

telangana

ETV Bharat / business

'ఆ నిధుల నుంచే టీకాల కొనుగోలు' - వ్యాక్సిన్ కొనుగోలు ఒప్పందం

వ్యాక్సిన్ల కొనుగోలు కోసం కేంద్ర బడ్జెట్‌లో కేటాయించిన నిధులను వినియోగించట్లేదన్న ఆరోపణలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఖండించింది. టీకాల కోసం కేటాయించిన మొత్తాన్ని వెచ్చిస్తున్నట్లు స్పష్టం చేసింది. బడ్జెట్​లో 'రాష్ట్రాలకు బదిలీ' అనే శీర్షిక టీకా కొనుగోలుకు అడ్డంకి కాదని వివరణ ఇచ్చింది.

ministry of finance
ఆర్థిక మంత్రిత్వ శాఖ

By

Published : May 10, 2021, 8:22 PM IST

2021-22బడ్జెట్​లో కేటాయించిన రూ.35 వేల కోట్ల నుంచే కరోనా టీకాలు కొనుగోలు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టతనిచ్చింది. 'రాష్ట్రాలకు బదిలీ' అనే శీర్షిక.. టీకాల కొనుగోలుకు అడ్డు కాదని పేర్కొంది. టీకాలకు కేటాయించిన నిధులను గ్రాంట్ల రూపంలో రాష్ట్రాలకు బదిలీ చేయనున్నట్లు తెలిపింది. కేంద్రం టీకాలు సేకరించి వాటిని రాష్ట్రాలకు ఉచితంగా అందిస్తోందని వివరించింది.

వ్యాక్సిన్ కొనుగోలుకు అయ్యే మొత్తాన్ని.. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకం కింద కాకుండా.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రత్యేక నిధుల నుంచి ఖర్చు చేస్తుందని కేంద్రం పేర్కొంది. వాస్తవానికి దీనిని రాష్ట్రాలే నిర్వహిస్తున్నట్లు భావించాల్సి ఉంటుందని తెలిపింది. అవసరమైతే ఈ రకమైన గ్రాంట్ల నిర్వహణను మార్చేందుకూ అవకాశం లేకపోలేదని స్పష్టం చేసింది.

ఇవీ చదవండి:'నిధుల కేటాయింపుల్లో ఆరోగ్య రంగంపై నిర్లక్ష్యం'

ABOUT THE AUTHOR

...view details