దేశ జీడీపీలో 20శాతం మేర ఎగుమతులు జరిగాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రానున్న రోజుల్లో ఇవి మరింత పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతిరంగంలో విశ్వవిజేతలను తయారు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇండియన్ మిషన్స్ అండ్ ఎక్పోర్ట్స్ ప్రమోషన్ కౌన్సిల్ సమావేశానికి ఆయన వర్చువల్గా హాజరయ్యారు.
"ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ పథకం, ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకం వల్ల పరిశ్రమలకు ఊతం అందింది. తద్వారా దేశీయ ఉత్పత్తి పెరిగింది. రెట్రోస్పెక్టివ్ పన్నును తొలగించేలా నిర్ణయం తీసుకోవడం.. ఎగుమతులను ప్రోత్సహించడంపై మా నిబద్ధతకు సాక్ష్యం."