2021 జనవరిలో ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) పేరోల్‌లో కొత్త చేరికలు భారీగా పెరిగాయి. 2020 జనవరితో పోలిస్తే 27.79 శాతం పెరిగి, కొత్తగా 13.36 లక్షల మంది నికర చందాదారులు చేరారని కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ మేరకు ఈపీఎఫ్ఓ పేరోల్ డేటాను శనివారం విడుదల చేసింది.
జనవరిలో భారీగా ఈపీఎఫ్ కొత్త చేరికలు - ఈపీఎఫ్‌లో కొత్త చేరికలు
2021 జనవరిలో ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ పేరోల్‌లో కొత్తగా 13.36 లక్షల మంది నికర చందాదారులు చేరారని కేంద్రం తెలిపింది. 2020 జనవరితో పోలిస్తే ఈ సంఖ్య 27.79 శాతం పెరిగినట్లు చెప్పింది.
జనవరిలో జోష్‌గా ఈపీఎఫ్ కొత్త చేరికలు
పేరోల్ డేటాలోని కీలకాంశాలు..
- 2020 డిసెంబర్ నుంచి 2021 జనవరి వరకు ఈపీఎఫ్‌లో కొత్త చందాదారులు 24 శాతం పెరిగారు.
- కొవిడ్ మహమ్మారి ఉన్నప్పటికీ.. 2020-21 ఆర్థిక సంవత్సరంలోని మొదటి పదినెలల్లో మొత్తం 62.49 లక్షల మంది చందాదారులు ఈపీఎఫ్ పేరోల్‌లో చేరారు.
- 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్‌లో చేరిన వారి సంఖ్య 78.58 లక్షలకు చేరింది. అంతకుముందు సంవత్సరంలో ఈ సంఖ్య 61.12 లక్షలుగా ఉంది.
- దేశవ్యాప్తంగా ఈపీఎఫ్ఓలో కొత్తగా చేరేవారి జాబితాలో మహారాష్ట్ర, హరియాణా, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక ముందు వరుసలో ఉన్నాయి.
ఇదీ చూడండి:నష్టమొచ్చినా సరే.. వారికి పారితోషికం చెల్లించాల్సిందే!