వచ్చే అర్థిక సంవత్సరం (2021-22) చివరి నాటికి దేశ ఆర్థిక వ్యవస్థ కరోనా ముందున్న స్థాయికి చేరుతుందని నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు క్షీణత కూడా 8 శాతం లోపే నమోదవ్వొచ్చని అంచనా వేశారు.
భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) కూడా.. కరోనా నేపథ్యంలో 2020-21లో జీడీపీ -9.5 శాతంగా నమోదవొచ్చన్న అక్టోబర్ అంచనాలను.. తాజాగా -7.5 శాతానికి సవరించింది.
భారత ఆర్థిక వ్యవస్థ సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో అంచనాలకన్నా వేగంగా రికవరీ అయ్యిందని రాజీవ్ కుమార్ తెలిపారు. తయారీ రంగం పుంజుకోవడం వల్ల క్యూ2లో వృద్ధి రేటు క్షీణత 7.5 శాతానికి పరిమితమైనట్లు వివరించారు.