తెలంగాణ

telangana

By

Published : Jan 10, 2021, 6:38 PM IST

ETV Bharat / business

కరోనా భయాలతో భారీగా నగదు చలామణి

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కరెన్సీ చలామణి 13శాతం పెరిగిందని రిజర్వ్ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా వార్షిక నివేదిక తెలిపింది. కరోనా నేపథ్యంలో ప్రజలు ముందు జాగ్రత్త చర్యలు పాటించిన కారణంగా ఈ పరిస్థితి తలెత్తిందని వెల్లడించింది.

BIZ-CURRENCY-CIRCULATION
కరోనా నేపథ్యంలో భారీగా నగదు చలామణి

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి మూడు త్రైమాసికాల్లో కరెన్సీ చలామణి 13శాతం పెరిగింది. కరోనా వల్ల నెలకొన్న అస్థిర పరిస్థితుల్లో చేతిలో డబ్బు ఉండాలని భావించిన ప్రజలు అధికంగా నగదు డ్రా చేశారని ఆర్​బీఐ అంచనా వేసింది.

ఇవీ లెక్కలు..

2020 మార్చి 31వరకు రూ.24,47,312కోట్ల నగదు చలామణిలో ఉండగా.. జనవరి 1 2021 నాటికి రూ.27,70,315కోట్ల పెరిగిందని(13% వృద్ధి) ఆర్బీఐ నివేదిక పేర్కొంది. 2020 ఏప్రిల్​-డిసెంబర్​ మధ్య ఈ వృద్ధి 6శాతమేనని గుర్తు చేసింది.

లాక్​డౌన్​ సమయంలో వచ్చే అత్యవసర ఖర్చులను దృష్టిలో ఉంచుకుని ప్రజలు ఎక్కువ నగదును కూడబెట్టుకున్నారని 'కేర్​ రేటింగ్స్' సంస్థ తెలిపింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు కరెన్సీ చలామణిలో పెరుగుదల అధికంగా ఉంది. సంక్షోభాలు తలెత్తినప్పుడల్లా ఇలాంటి ధోరణి సహజమే. దీని వెనుక ముందు జాగ్రత్త తప్ప మరో ఉద్దేశం లేదు.

-మదన్​ సబ్నవీస్, ఆర్థికవేత్త, కేర్​ రేటింగ్స్

ఒక్కసారిగా డిమాండ్..

కరోనా వల్ల ఏర్పడిన అనిశ్చితి నేపథ్యంలో కరెన్సీకి డిమాండ్ పెరగిందని 2019-20 వార్షిక నివేదికలో ఆర్​బీఐ పేర్కొంది. ఈ డిమాండ్‌కు తగ్గట్టు రిజర్వ్ బ్యాంకు చర్యలు తీసుకున్నట్టు వెల్లడించింది.

ఇదీ చదవండి:'జియో మార్ట్​ అండతో 'ఫ్యూచర్'​ మెరుగు'

ABOUT THE AUTHOR

...view details