గతేడాది కరోనా లాక్‌డౌన్ కారణంగా ప్రయాణికుల వాహన ఎగుమతులు 39 శాతం క్షీణించినట్లు భారత వాహన తయారీదార్ల సంఘం(సియామ్) వెల్లడించింది. ముఖ్యంగా గతేడాది మొదటి ఆరు నెలలు ఎగుమతులు దారుణంగా పడిపోయినట్లు వెల్లడించింది. ద్వితీయార్థంలో మెరుగైనప్పటికీ 2020తో పోలిస్తే తక్కువగానే నమోదైందని.. అయితే పరిశ్రమ ఉత్తమంగా ప్రయత్నాలు చేసిందని వివరించింది.
సియామ్ గణాంకాల ప్రకారం..
2020-21లో ప్రయాణికుల వాహన(పీవీ) ఎగుమతులు 38.92 శాతం తగ్గి 4,04,400 యూనిట్లుగా నమోదయ్యాయి. 2019-20లో ఇవి 6,62,118 అమ్ముడయ్యాయి.
ప్రయాణికుల 'కార్ల' అమ్మకాలు గత ఆర్థిక సంవత్సరం 44.32 శాతం తగ్గి.. 2,64,927 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి.
అదేవిధంగా.. 2019-20లో 1,83,468 యూనిట్లతో పోలిస్తే.. స్పోర్ట్ యుటిలిటీ వాహన ఎగుమతులు 24.88 శాతం క్షీణించాయి.