తెలంగాణ

telangana

ETV Bharat / business

దేశంలో 60శాతం పైగా జీడీపీ ఆ రాష్ట్రాలదే! - lockdown news

దేశంలో వైరస్​ ప్రభావం ఎక్కువగా ఉన్న ఎనిమిది రాష్ట్రాలు.. జాతీయ స్థూల ఉత్పత్తి( జీడీపీ)లో 60శాతం వాటా కలిగి ఉన్నట్లు ఓ నివేదిక తెలిపింది. ప్రస్తుతం లాక్​డౌన్​ కారణంగా విధించిన ఆంక్షలు ఇలాగే కొనసాగితే.. ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిపోతుందని హెచ్చరించింది.

COVID-19: Eight most affected states account for 60% of GDP
'ఆంక్షలు ఇలాగే కొనసాగితే జీడీపీ పడిపోవడం ఖాయం'

By

Published : May 20, 2020, 6:01 AM IST

దేశవ్యాప్తంగా విధించిన లాక్​డౌన్​ ఆంక్షలు కారణంగా ఆర్థిక కార్యకలాపాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వైరస్​ ప్రభావం అధికంగా ఉన్న ఎనిమిది రాష్ట్రాలు జీడీపీలో 60 శాతానికిపైగా వాటా కలిగి ఉన్నట్లు ఓ నివేదిక తెలిపింది. ఆంక్షలు ఇలాగే కొనసాగితే ఆర్థిక పరిస్థితి మరింత పడిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. దేశం మొత్తంలో దాదాపు 58 శాతం ఉపాధి అవకాశాలు.. మహరాష్ట్ర, గుజరాత్​, తమిళనాడుతో సహా మొత్తం ఎనిమిది రాష్ట్రాల్లోనే ఉన్నట్లు జాతీయ రేటింగ్​ ఏజెన్సీ పరిశోధన బృందం తెలిపింది. కేంద్రం ఉద్దీపనలు ప్రకటించినప్పటికీ.. జీడీపీ 5 శాతం వరకు తగ్గే అవకాశాలున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఆ రంగాలకు భారీ నష్టం...

మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్​ రాష్ట్రాలు పారిశ్రామిక, సేవా రంగాలపై నుంచి వచ్చే ఉత్పత్తులపై ఎక్కువగా ఆధారపడుతుంటారు. లాక్​డౌన్​ పొడిగింపుతో.. ఆయా రంగాలు తీవ్ర నష్టాన్ని చవిచూసే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్​, రాజస్థాన్​, ఉత్తర్​ప్రదేశ్​ రాష్ట్రాలకు ఇప్పటికే చాలా అప్పులు ఉన్నాయని పేర్కొన్నారు. పెట్రోలియం, లిక్కర్​ వంటి ప్రధాన ఆదాయ వనరులపై ఈ రాష్ట్రాలు ఆధారపడాల్సి ఉంటుందని వివరించారు.

ఈ ఎనిమిది రాష్ట్రాల్లో వ్యవసాయంలో 64 శాతం, పారిశ్రామిక రంగం నుంచి 63, సేవా రంగంలో 53 శాతం మేర రాష్ట్ర స్థూల విలువ జోడింపు(జీఎస్​వీఎ) వాటా కలిగి ఉన్నట్లు నివేదిక తెలిపింది.

ఆ రాష్ట్రాలకూ తప్పదు ఆర్థిక భారం...

వైరస్​ ప్రభావం తక్కువగా ఉన్న కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లోనూ ఆంక్షలతో ఆర్థిక కష్టాలు తప్పవని విశ్లేషకులు తెలిపారు. వ్యవసాయ ఆధారిత రాష్ట్రాల్లో రానున్న రుతుపవనాలు ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేస్తుందని భావిస్తున్నారు నిపుణులు.

పెరుగుతున్న కేసులు...

ఇటీవలె మే 31 వరకు లాక్​డౌన్​ను పొడిగించింది కేంద్రం. గ్రీన్​, రెడ్​, ఆరెంజ్​ జోన్ల నిర్ణయాన్ని రాష్ట్రాలకే వదిలేసింది. అయితే, మహారాష్ట్ర వంటి ప్రభావిత రాష్ట్రాలు ఆంక్షలను కొనసాగించాలని నిర్ణయించాయి. తొలి రెండు లాక్​డౌన్​ కాలంలో అన్ని రాష్ట్రాల్లో వైరస్​ వ్యాప్తి సాధారణ స్థాయిలో ఉన్నప్పటికీ.. మూడు, నాలుగు దశల్లో భారీగా కేసులు నమోదయ్యాయి.

ABOUT THE AUTHOR

...view details