పన్ను చెల్లింపుదారులకు కీలక ప్రకటన చేసింది కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ). 2021-22 మదింపు సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్ను దాఖలు చేసేందుకు గడువును పొడగించింది.
ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు రిటర్నులు సమర్పించేందుకు వీలు కల్పిస్తున్నట్లు తెలిపింది.
ఐటీఆర్ దాఖలు చేయడంలో ఇబ్బందుల గురించి పన్ను చెల్లింపుదారుల నుంచి అందిన వినతుల మేరకు గడువును పొడగించినట్లు ఆదాయంపు పన్ను శాఖ వివరించింది.
నిజానికి 2021-22 మదింపు సంవత్సరానికి రిటర్ను సమర్పించేందుకు జులై 31 చివరి తేదీ. అయితే కొవిడ్ సహా పలు ఇతర కారణాల నేపథ్యంలో దీనిని సెప్టెంబర్ 30కి పెంచింది సీబీడీటీ. తాజాగా దానిని మరో మూడు నెలలు పొడగించింది.
2020-21 మదింపు సంవత్సరానికి గానూ ఆడిట్ నివేదికలను దాఖలు చేసేందుకు కూడా గడావును పెంచింది సీబీడీటీ. సెప్టెంబర్ 30తో ముగియనున్న ఈ గడువును.. అక్టోబర్ 31 వరకు పెంచింది. 2021-22 ఆడిట్ నివేదిక సమర్పించేందుకు తుడి గడువును 2022 జనవరి 15 వరకు పొడగించింది.
ఇదీ చదవండి:వచ్చే నెల నుంచి ఆ బ్యాంకుల చెక్‌బుక్‌లు పనిచేయవు!