తెలంగాణ

telangana

ETV Bharat / business

భారత ఎగుమతుల్లో 11 శాతం వృద్ధి - chemical

గత నెలలో భారత ఎగుమతులు భారీగా పెరిగాయి. కిందటేడాదితో పోల్చుకుంటే 11 శాతం వృద్ధి నమోదైంది. ఫార్మా, రసాయన, ఇంజినీరింగ్ రంగాల్లో ఎగుమతులు పెరిగాయి.

భారత ఎగుమతుల్లో 11 శాతం వృద్ధి

By

Published : Apr 16, 2019, 7:47 AM IST

Updated : Apr 16, 2019, 7:56 AM IST

మార్చి నెలలో భారత ఎగుమతుల్లో పురోగతి నమోదైంది. 11శాతం వృద్ధితో 32.55 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులు భారత్​ నుంచి ఎగుమతయ్యాయి. దీనిలో అధిక భాగం ఫార్మా, రసాయన, ఇంజినీరింగ్ రంగాల ఉత్పత్తులు ఉన్నాయి.

గతేడాది మార్చిలో వాణిజ్య లోటు 13.51 బిలియన్ డాలర్లు ఉండగా... ప్రస్తుతం 10.89 బిలియన్ డాలర్లకు తగ్గింది.

భారత దిగుమతులు గత నెలకు 1.44 శాతం పెరిగాయి. 43.44 బిలియన్ డాలర్ల విలువైన వస్తువుల్ని దిగుమతి చేసుకుంది భారత్.

పెరిగిన బంగారం దిగుమతులు

బంగారం దిగుమతులు కిందటేడాదితో పోల్చుకుంటే 31.22 శాతం పెరిగాయి. దీని విలువ 3.27 బిలియన్ డాలర్లు.

ఇంధన దిగుమతులు 5.55 శాతం పెరిగి 11.75 బిలియన్​ డాలర్లుగా నమోదయ్యాయి.

ఏడాదిలో మాత్రం లోటే...

2018-19 ఆర్థిక సంవత్సరంలో 9 శాతం పెరిగిన ఎగుమతులు 331 బిలియన్​ డాలర్లకు చేరుకున్నాయి. దిగుమతుల్లోనూ 8.99 వృద్ధి నమోదు చేసి 507.44 బిలియన్​ డాలర్లకు చేరుకున్నాయి.

పూర్తి ఏడాదిని గమనిస్తే మాత్రం వాణిజ్య లోటు పెరిగింది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో 162 బిలియన్ల డాలర్లుగా వాణిజ్య లోటు 2018-19కు 176.42 బిలియన్​ డాలర్లుగా నమోదైంది.

Last Updated : Apr 16, 2019, 7:56 AM IST

ABOUT THE AUTHOR

...view details