తెలంగాణ

telangana

By

Published : Sep 2, 2020, 5:59 PM IST

ETV Bharat / business

'మారటోరియంలో జరిమానాలు విధించడం సరికాదు'

మారటోరియం సమయంలో వడ్డీ వసుళ్లపై మరోసారి సుప్రీం కోర్టులో వాదనలు నడిచాయి. బ్యాంకులకు రుణాల పునర్నిర్మాణానికి సంపూర్ణ అధికారాలనున్నా.. మారటోరియం ఎంచుకున్న రుణ గ్రహీతలపై జరిమానాలు విధించడం సరికాదని ఓ పిటిషనర్​ తరఫు న్యాయవాది వాదించారు.

Case of charging interest on moratoriums
మారటోరియం పొడగింపు వివాదం

మారటోరియం సమయంలో వడ్డీ వసూలు కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. ఇందులో వడ్డీ వసూళ్లకు వ్యతిరేకంగా వ్యాజ్యం దాఖలు చేసిన గజేంద్ర శర్మ తరఫున సీనియర్ న్యాయవాది రాజీవ్ దత్త సుప్రీంలో వాదనలు వినిపించారు. రుణాల పునర్నిర్మాణానికి బ్యాంకులకు పూర్తి స్వేచ్ఛ ఉన్నప్పటికీ.. నిజాయితీగా రుణాలు తిరిగి చెల్లిస్తున్న రుణగ్రహీతలపై మారటోరియంలో జరిమానాలు విధించడం సరికాదని.. రాజీవ్​దత్తా సుప్రీం కోర్టుకు విన్నవించారు.

'ఆర్​బీఐ తీసుకువచ్చిన మారటోరియం వెసులుబాటు ముగిసిన తర్వాతే ఈఎంఐలు చెల్లించొచ్చు అనుకున్నాం. కానీ మాకు మారటోరియం సమయంలోనూ వడ్డీ చెల్లించాలని తర్వాత తెలిసింది. ఇలాంటి సమయాల్లో వడ్డీపై వడ్డీ చెల్లించాల్సి రావడం అనేది మాపై మరింత భారం పెంచుతుంది.' అని ధర్మాసనానికి వివరించారు రాజీవ్ దత్త.

బ్యాంకులకు అర్​బీఐ అనేక వేసులుబాటులు ఇచ్చిందన్న రాజీవ్ దత్త.. వినియోగదారులకు మాత్రం ఎలాంటి ఉపశమనం కల్పించలేదన్నారు. కరోనా సంక్షోభంలో జరిమానాలు విధిస్తున్న విషయాన్ని తప్పుబడుతూ.. ఆర్​బీఐ నియంత్రణ సంస్థ మాత్రమేనని.. బ్యాంకులకు ఏజెంట్ కాదని వాదించారు.

ఇదే విషయంలో రియల్ ఎస్టేట్ డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది సీఏ సుందరం.. మారటోరియాన్ని కనీసం ఆరు నెలలు పొడిగించేలా చూడాలని ధర్మాసనాన్ని కోరారు. మారటోరియం సమయంలో వడ్డీ మాఫీ చేయలేకపోతే.. బ్యాంకులు తమ డిపాజిటర్లకు చెల్లించే మొత్తాలను తగ్గించాలని పేర్కొన్నారు.

పరిశ్రమలకు మారటోరియం సదుపాయాన్ని కల్పించేందుకు బ్యాంకులకు ఆర్​బీఐ జారీ చేసిన ఆగస్టు 6 నాటి సర్కులర్​ను సుందరం ప్రస్తావించారు.

అయితే మంగళవారం విచారణలో భాగంగా కొవిడ్-19 నేపథ్యంలో విధించిన మారటోరియంను రెండేళ్లు పెంచే అవకాశముందని కేంద్రం, ఆర్​బీఐ సర్వోన్నత న్యాయస్థానానికి తెలిపిన విషయం తెలిసిందే. సంక్షోభంలో చిక్కుకున్న రంగాల కోసం పలు చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నాయి.

ఇదీ చూడండి:భారీగా దిగొచ్చిన బంగారం, వెండి ధరలు

ABOUT THE AUTHOR

...view details