తెలంగాణ

telangana

ETV Bharat / business

2019-20లో వృద్ధి 7.5 శాతం - సుభాష్​ చంద్ర గార్గ్​

2019-20లో దేశ ఆర్థికవృద్ధి అంచనాలను విడుదల చేశారు ఆర్థిక శాఖ కార్యదర్శి సుభాష్​చంద్ర గార్గ్​.

భారత వృద్ధి 7.5 శాతం

By

Published : Feb 6, 2019, 4:55 AM IST

Updated : Feb 6, 2019, 7:45 AM IST

2019-20 సంవత్సరానికి దేశ ఆర్థిక వృద్ధిని 7.5 శాతంగా అంచనా వేసినట్లు ఆర్థిక శాఖ కార్యదర్శి సుభాష్​ చంద్ర గార్గ్​ తెలిపారు. దీనితో పాటు నామమాత్రపు వృద్ధి 11.5 శాతంగా, ద్రవ్యోల్బణం 4 శాతం ఉంటుందన్నారు. ప్రస్తుత ఏడాది వృద్ధి 7.2 శాతంగా ఉంటుందని పేర్కొన్నారు. పెద్ద నోట్లు రద్దు చేసిన 2016-17 సంవత్సరంలో జీడీపీ పెరుగుదల 8.2 శాతంగా ఉందని తెలిపారు.

2019-20 బడ్జెట్​ మెజారిటీ ప్రజలను చేరుతుందని వ్యాఖ్యానించారు. "ఆర్థిక క్రమ శిక్షణ పాటించాలని లేకుంటే ద్రవ్యోల్బణం పెరిగి, పెబ్టుబడులపై ప్రభావం పడుతుంది. గ్రామీణ విద్యుతీకరణ, అందరికి ఇళ్లు, అనుసంధానం లాంటివన్నీ ఈ దిశగా చర్యలే" అని గార్గ్​ తెలిపారు.

Last Updated : Feb 6, 2019, 7:45 AM IST

ABOUT THE AUTHOR

...view details