నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా.. 15వేల పాఠశాలలను శక్తివంతంగా తీర్చిదిద్దనున్నట్టు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అదే సమయంలో ఎన్జీఓల భాగస్వామ్యంతో 100 కొత్త సైనిక్ పాఠశాలలను ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు.
2021 బడ్జెట్ను లోక్సభలో ప్రవేశపెట్టారు నిర్మల. నూతన జాతీయ విద్యా విధానానికి సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయని తెలిపారు. 2019-20 బడ్జెట్లో.. ఉన్నతవిద్యా కమిషన్ గురించి ప్రస్తావించినట్టు.. దానిని అమలు చేసేందుకు ఈ ఏడాది చట్టాన్ని తీసుకురానున్నట్టు పేర్కొన్నారు.