తెలంగాణ

telangana

ETV Bharat / business

జొమాటో బిర్యానీ దారిలో తినేయడం అసాధ్యం - అన్​లైన్ ఫుడ్​ డెలివరీ సంస్థ

ఆన్​లైన్​ ఫుడ్​ డెలివరీ సంస్థ జొమాటో ట్యాంపర్​ రహిత​ ప్యాకేజింగ్​ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ప్రకటించింది. గతంలో జరిగిన ఫుడ్ ట్యాంపరింగ్ సంఘటనల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది జొమాటో. మొదటి దశలో దిల్లీ, హైదరాబాద్​ సహా దేశంలోని 10 పట్టణాల్లో ఈ విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలిపింది.

జొమాటో

By

Published : Mar 21, 2019, 8:26 AM IST

Updated : Mar 21, 2019, 10:04 AM IST

ఫుడ్​ ట్యాంపరింగ్​ జరగకుండా ఇకపై ట్యాంపర్ ప్రూఫ్​ ప్యాకింగ్ అందుబాటులోకి తెస్తున్నట్లు ఆన్​లైన్​ ఫుడ్​ డెలివరీ సంస్థ జొమాటో ప్రకటించింది. మొదట దేశంలోని 10 నగరాల్లో ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది.

"పాలీమర్​​తో ఈ ప్యాకేజింగ్​ ఉండనుంది. దీనిని పునర్వినియోగానికి, పునరుత్పత్తికి వినియోగించవచ్చు" అని జొమాటో ప్రకటించింది.

ఇది 100 శాతం ట్యాంపర్​ ప్రూఫ్​ ప్యాకింగ్​గా కంపెనీ పేర్కొంది. ఒక సారి రెస్టారెంట్​ ప్యాక్​ చేసి ఇచ్చిన తర్వాత వినియోగదారుడు మాత్రమే ప్యాకింగ్ స్ట్రిప్​ను కత్తిరించి.. తెరిచేలా ఈ విధానం ఉండనున్నట్లు జొమాటో వివరించింది.

మొదటి దశలో దిల్లీ, బెంగళూరు, కోల్​కతా, హైదరాబాద్​, పుణె, జైపూర్​, చండీగఢ్​, నాగ్​పుర్, వడోదర పట్టణాల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు కంపెనీ పేర్కొంది.

గతంలో జొమాటో డెలివరీ బాయ్​ ఫుడ్​ ట్యాంపరింగ్​కు పాల్పడుతూ కెమెరాకు చిక్కిన ఘటన వైరల్​గా మారింది. దీనిపై అప్పట్లో జొమాటోపై తీవ్ర విమర్శలు వచ్చాయి. జొమాటో తన తప్పును అంగీకరించింది.

ఫుడ్​ డెలివరీలో మరింత పారదర్శకతను పెంచేందుకు ఈ నూతన ప్యాకేజింగ్​ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది ఆ సంస్థ.

Last Updated : Mar 21, 2019, 10:04 AM IST

ABOUT THE AUTHOR

...view details