ఎస్ బ్యాంక్ సంక్షోభం ప్రభావం దాని అనుబంధ డిజిటల్ పేమెంట్ సంస్థలపైనా పడింది. ప్రముఖ యూపీఐ సంస్థ ఫోన్‌పేకు ఎస్ బ్యాంక్ నగదు రుణదాతగా వ్యవహరిస్తోంది. ఫలితంగా ఫోన్‌పేలో లావాదేవీలు నిలిచిపోయాయి.
ఎస్ బ్యాంక్‌పై ఆర్బీఐ మారటోరియం విధించిన తర్వాత.. నిన్నటి సాయంత్రం నుంచి దాని నెట్ బ్యాంకింగ్ పనిచేయటం లేదు. అందువల్ల ఎస్ బ్యాంక్ నెట్ బ్యాంకింగ్‌పై ఆధారపడిన డిజిటల్ ఆపరేటర్ల లావాదేవీలు నిలిచిపోతున్నాయి.
ఈ విషయమై ఫోన్‌పే యాప్ చీఫ్ సమీర్ నిగమ్ వివరణ ఇచ్చారు.
"అసౌకర్యానికి చింతిస్తున్నాం. మా బ్యాంక్ భాగస్వామిపై ఆర్బీఐ మారటోరియం విధించింది. సేవలను పునరుద్ధరించేందుకు మా బృందమంతా రాత్రి నుంచి కృషి చేస్తున్నాం. సాధ్యమైనంత త్వరలో సేవలను అందుబాటులోకి తెస్తాం."
- సమీర్ నిగమ్, ఫోన్‌పే చీఫ్
ఎస్ బ్యాంకుపై మారటోరియం విధిస్తూ రిజర్వ్ బ్యాంక్ గురువారం రాత్రి ఆదేశాలు జారీ చేసింది. ఖాతాదార్లకు నెలకు రూ.50,000 మాత్రమే ఒక్కో ఖాతా నుంచి నగదు ఉపసంహరణకు వీలుంటుందని తెలిపింది. అదే సమయంలో తక్షణం ఎస్ బ్యాంకు బోర్డును రద్దు చేసింది.
ఇదీ చూడండి:యెస్ బ్యాంక్‌పై మారటోరియం- సగం వాటా ఎస్బీఐకి!