తెలంగాణ

telangana

ETV Bharat / business

5 కెమెరాలతో షియోమీ నుంచి సూపర్ బడ్జెట్​ ఫోన్​! - xiaomi a3 pro price in india

చైనా మొబైల్​ దిగ్గజం షియోమీ మరో స్మార్ట్​ఫోన్​ తీసుకురానుంది. వెనుకవైపు 5 కెమెరాలతో రూపొందించిన ఎంఐ సీసీ9 ప్రోను నవంబర్​ 5న విడుదల చేయనుంది. భారత్​లో ఎంఐ ఏ3 ప్రో పేరుతో రానున్నట్లు సమాచారం.

సూపర్ బడ్జెట్​ ఫోన్​!

By

Published : Oct 28, 2019, 12:53 PM IST

Updated : Oct 28, 2019, 6:56 PM IST

బడ్జెట్​ ధరల్లో స్మార్ట్​ఫోన్లు అందించే చైనా దిగ్గజ సంస్థ షియోమీ నుంచి మరో కొత్త మొబైల్​ రాబోతుంది. వెనుకవైపు 5 కెమెరాలతో రూపొందించిన ఎంఐ సీసీ9 ప్రో స్మార్ట్​ఫోన్​ను నవంబర్ ​5న విడుదల చేసేందుకు సిద్ధమైంది షియోమీ.

సీసీ9 ప్రోకు సంబంధించి పూర్తి ఫీచర్లను షియోమీ వెల్లడించలేదు. మీటూ సంస్థ భాగస్వామ్యంలో వచ్చిన సీసీ స్మార్ట్​ఫోన్ల సిరీస్​లో సీసీ9 ప్రో మూడోది. ఇప్పటివరకు ఈ సిరీస్​లో సీసీ9, సీసీ9ఈ ఫోన్లను విడుదల చేసింది షియోమీ.

భారత్​లో ఏ3 ప్రో!

సీసీ9ఈను ప్రపంచ మార్కెట్లో ఎంఐ ఏ3 ఆండ్రాయిడ్​ వన్​ పేరుతో విడుదల చేసింది. సీసీ9 ప్రోను ఏ3 ప్రోగా విడుదల చేయనున్నట్లు సమాచారం. 6జీబీ ర్యామ్​-128 జీబీ రామ్​, 8 జీబీ ర్యామ్​-128జీబీ రామ్​, 8జీబీ ర్యామ్​-256 జీబీ వేరియంట్లలో లభించనుంది.

5 కెమెరాలు

అధికారిక సమాచారం ప్రకారం.. సీసీ9 ప్రోలో కెమెరాపై ప్రధానంగా దృష్టి సారించింది షియోమీ. వెనుకవైపు 5 కెమెరాలను ఇందులో పొందుపరిచింది. ప్రధాన కెమెరాలో శాం​సంగ్ రూపొందించిన 108 మెగాపిక్సల్​ సెన్సార్​ను అమర్చింది. ఫొటో బ్యాక్​గ్రౌండ్​ స్పష్టత కోసం 12 ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్, 8ఎంపీ టెలిఫొటో లెన్స్​, మాక్రో లెన్స్, డెప్త్ సెన్సార్లనూ పొందుపరిచింది.

ఒప్పో రెనో ఫోన్ల తరహాలో 5 రెట్లు ఆప్టికల్​ జూమ్​ ఆప్షన్​ కూడా ఇచ్చింది షియోమీ. మార్కెట్లో ప్రస్తుతానికి 5 కెమెరాలున్న స్మార్ట్​ ఫోన్​ నోకియా 9 ప్యూర్​వ్యూ మాత్రమే.

ప్రత్యేకతలు

  • 6.4 అంగుళాల ఫుల్​ హెచ్​డీ అమోఎల్​ఈడీ తెర
  • క్వాల్​కమ్​ స్నాప్​డ్రాగన్​ 730జీ చిప్​సెట్​
  • 108ఎంపీ వెనుక ప్రధాన కెమెరా, 32 ఎంపీ సెల్ఫీ కెమెరా
  • బ్యాటరీ సామర్థ్యం-4000 ఎంఏహెచ్​

ధర రూ.16,000 నుంచి రూ.20,000 మధ్య ఉండొచ్చని మార్కెట్​ నిపుణుల అంచనా.

ఇదీ చూడండి: జియో గుడ్​న్యూస్​: ఉచిత కాల్​ బ్యాలెన్స్​తో కొత్త ప్లాన్లు

Last Updated : Oct 28, 2019, 6:56 PM IST

ABOUT THE AUTHOR

...view details