దేశీయ టెలికాం దిగ్గజం జియోతో కలిసి బడ్జెట్ స్మార్ట్ఫోన్ను(jio phone) తీసుకువచ్చేందుకు కసరత్తు కొనసాగుతున్నట్లు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ వెల్లడించారు. అయితే బడ్జెట్ స్మార్ట్ఫోన్ (jio phone) ఎప్పుడు విడుదలయ్యే అవకాశం ఉంది? అనే విషయంపై మాత్రం పిచాయ్ స్పష్టతనివ్వలేదు.
దేశంలో చౌకైన మొబైల్ డేటా అందుబాటులో ఉండటం వల్ల.. బడ్జెట్ ధరలో స్మార్ట్ఫోన్(smartphone) అందించి ఎక్కువ మందికి ఇంటర్నెట్ను చేరువ చేయొచ్చని గూగుల్ భావిస్తోంది.