సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్‌బుక్‌కు చెందిన మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో త్వరలో మరిన్ని అధునాత ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. తమ వినియోగదారులకు చేరువయ్యేందుకు ఇప్పటికే డార్క్‌మోడ్ వంటి ఫీచర్లను అందుబాటులోకి తెచ్చిన వాట్సాప్.. త్వరలోనే మల్డీ డివైజ్ లాగిన్, సెల్ఫ్ డిస్ట్రక్టివ్ మెసేజెస్ వంటి సదుపాయాలను అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తోంది.
మల్టీ డివైజ్ సపోర్ట్
ఇతర మెసేజింగ్ ఆపరేటర్లతో పోలిస్తే వాట్సాప్ చాలా ఆలస్యంగా ఫీచర్లను రూపొందిస్తుంది. టెలిగ్రామ్ యాప్‌లో ఇప్పటికే మల్టీ డివైజ్ ఫీచర్ ఉండగా.. వాట్సాప్ మాత్రం ఇప్పటికీ ఈ సౌలభ్యాన్ని అందుబాటులోకి తీసుకురాలేదు. అయితే ఈ సదుపాయం తీసుకొచ్చేందుకు వాట్సాప్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది అందుబాటులోకి వస్తే ఒకే సమయంలో రెండు డివైజ్‌ల నుంచి వాట్సాప్‌ను ఉపయోగించుకోవచ్చు. దీనిపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది.
సెల్ఫ్ డిస్ట్రక్టివ్ మెసేజెస్
మెసేజ్‌లు వాటంతట అవే డిలీట్ అయ్యే ఫీచర్ ప్రవేశపెట్టేందుకు వాట్సాప్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. స్నాప్‌చాట్‌లో ఇప్పటికే ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలో వాట్సాప్‌లోనూ చూసే అవకాశం ఉంది. వాట్సాప్ డిలీట్ ఫీచర్‌కి, డిస్ట్రక్షన్ ఫీచర్ కాస్త భిన్నం.
మనం ఏ మెసేజ్‌లైతే డిలీట్ చేయాలనుకుంటున్నామో డిస్ట్రక్షన్ ఫీచర్లో ముందుగానే వాటికి టైమర్ సెట్ చెయ్యొచ్చు. ఆ సమయంలో మెసేజ్‌లు వాటంతట అవే డిలీట్ అయిపోతాయి. ఈ ఫీచర్‌ను ఆఫ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఆ తర్వాత వారం క్రితం మెసేజ్‌లను తిరిగి పొందే వీలుంటుంది. ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్న ఈ ఫీచర్.. వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.20.110లో అభివృద్ధి చేస్తున్నారు.
సెర్చ్ మెసేజెస్ ఆన్ ది వెబ్
వాట్సాప్‌లో నకిలీ మెసేజ్‌లకు అంతులేకుండాపోతోంది. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 విజృంభిస్తున్న తరుణంలో ఇలాంటి మెసేజ్‌లు మరింత ఎక్కువైపోయాయి. వీటికి చెక్ పెట్టడానికి వాట్సాప్ సరికొత్త ఫీచర్‌తో ముందుకు రాబోతోంది.
వాట్సాప్‌లో వచ్చిన మెసేజ్‌ల విశ్వసనీయతను తెలుసుకోవడానికి 'సెర్చ్ మెసేజెస్ ఆన్ ది వెబ్' ఫీచర్‌ను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఫీచర్ ప్రకారం ఫార్వడ్ చేసిన మెసేజ్‌ల ముందు ఓ సెర్చ్ బటన్ ఉంటుంది. ఆ మెసేజ్‌కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తనిఖీ చేసి తప్పుడు వార్తలను పసిగట్టే అవకాశం ఉంటుంది.
వీడియో స్టేటస్లు 15 సెకన్లే
టెలికాం ఆపరేటర్ల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు స్టేటస్ నిడివిని 15 సెకన్లకు తగ్గించింది వాట్సాప్. లాక్డౌన్ నేపథ్యంలో డేటా వాడకం పెరిగి నెట్‌వర్క్‌పై ఎక్కువ లోడ్ పడుతున్న కారణంగా ఆపరేటర్లు ఈ అభ్యర్థన చేశాయి. భారత్‌లోనే ప్రత్యేకంగా ఈ అప్డేట్ తీసుకొచ్చింది వాట్సాప్. అయితే నెట్వర్క్ పరిమితులు చక్కబడిన తర్వాత దీన్ని ఉపసంహరించే అవకాశం ఉంది.
డార్క్‌మోడ్
వాట్సాప్ వినియోగదారులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఫీచర్ ఇది. ఈ ఎదురుచూపులకు తెరదించుతూ ఆండ్రాయిడ్, ఐఓఎస్ వెర్షన్లలో డార్క్‌మోడ్‌ను ప్రవేశపెట్టింది వాట్సాప్. రాత్రి పూట ఎక్కువగా వాట్సాప్ వినియోగించినప్పుడు కళ్లకు ఇబ్బందులు కలగకుండా ఈ ఫీచర్ తీసుకొచ్చింది. కాంట్రాస్ట్, రీడబిలిటీని సైతం మెరుగుపర్చింది వాట్సాప్. డార్క్‌మోడ్‌లో ఈ ఫీచర్ ఆన్ చేయాలనుకుంటే చాట్స్ థీమ్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి డార్క్ థీమ్‌ను సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. కళ్లకు ఇబ్బందులు కలగకుండా రాత్రి సమయంలోనూ మీ సన్నిహితులతో చాట్ చేసుకోవచ్చు.