తెలంగాణ

telangana

ETV Bharat / business

'వాట్సాప్​, టెలిగ్రామ్​లలో గోప్యత లోపాలు' - aHACKING

వాట్సాప్​, టెలిగ్రామ్ వంటి సంక్షిప్త సందేశాల యాప్​లలో గోప్యత భద్రతకు సంబంధించి లోపాలున్నాయని సైబర్ సెక్యూరిటీ సంస్థ 'సిమాంటెక్' పరిశోధకులు సంచలన విషయాలు వెల్లడించారు. ఈ లోపాల ద్వారా వాటి వినియోగదారుల ఫోటోలు, ఇతర డాక్యుమెంట్​లు హ్యాకింగ్​కు గురయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపారు.

వాట్సాప్ ,టెలిగ్రామ్​

By

Published : Jul 17, 2019, 8:00 AM IST

సంక్షిప్త సందేశాల యాప్​లు.. వాట్సాప్, టెలిగ్రామ్ ప్రస్తుతం ఎండ్​ టూ ఎండ్ ఎన్​క్రిప్షన్(పంపిన వారు, అందుకున్న వారికి మాత్రమే కనిపించే సాంకేతికత) రక్షణను కల్పిస్తున్నాయి. ఈ కారణంగా వీటి వాడకం పూర్తిగా సురక్షితం అని మీరు నమ్ముతున్నారా? అయితే మీరు మీ నిర్ణయాన్ని పునరాలోచించుకోక తప్పదు. ఎందుకంటే సైబర్-సెక్యూరిటీ సంస్థ 'సిమాం​టెక్' పరిశోధకులు సంచలన విషయాలు బయటపెట్టారు. వాట్సాప్​, టెలిగ్రామ్ ఆండ్రాయిడ్ వర్షన్​లలో లోపాలు ఉన్నట్లు తెలిపారు.

'మీడియా ఫైల్​ జాకింగ్​' రక్షణ వ్యవస్థలో లోపం కారణంగా ఆండ్రాయిడ్ వాట్సాప్, ఆండ్రాయిడ్​ టెలిగ్రామ్​లలో ఈ హ్యాకింగ్​లు జరగొచ్చని పరిశోధకులు తమ బ్లాగ్​లో వెల్లడించారు.

పరిశోధన ప్రకారం.. వాట్సాప్​ ఆటోమేటిక్​గా ఫైళ్లను బాహ్య స్టోరేజీలో పొందుపరుస్తోంది. అదే విధంగా ఆండ్రాయిడ్​ టెలిగ్రామ్​ 'సేవ్​ టూ గ్యాలరీ' ఫీచర్​ను ఎనేబుల్ చేయడం ద్వారా ఫైళ్లను ఫోన్ మెమోరిలోకి సేవ్ చేస్తోంది.

అయితే తాజాగా గుర్తించిన లోపం కారణంగా... సైబర్ దాడులకు పాల్పడే హ్యాకర్లు ఆయా యాప్​ల నుంచి బదిలీ అయ్యే వ్యక్తిగత సమాచారం, ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్​లు, ఇన్​వాయిస్​లు ఇలా అన్నింటిని దుర్వినియోగం చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

యాప్​ డౌన్​లోడ్ చేసుకుని వాడుతున్నప్పుడు.. యూజర్లకు తెలియకుండానే ఆ యాప్​లలో బదిలీ అయ్యే సమాచారాన్ని హ్యాకర్లు చూడగలుగుతారని పేర్కొన్నారు. ఇలా ఒక వ్యక్తి మరో వ్యక్తికి ఫోటోలు పంపినప్పుడు... పంపిన వ్యక్తికి తెలియకుండానే ఆ ఫోటోలను మార్చి పంపించే అవకాశం ఉందని తెలిపారు. అదే విధంగా ఏమైనా కొనుగోళ్లు జరిపినప్పుడు పంపించే ఇన్​వాయిస్ డాక్యుమెంట్​లు, ఆడియో ఫైళ్లను తప్పుదోవ పట్టించి తప్పుడు సమాచారాన్ని చేరవేసే అవకాశం ఉందని తెలిపారు.

ఇంతకు ముందు కూడా వాట్సాప్ ఆడియో కాల్​ ఫీచర్​లో లోపం ఉన్నట్లు ఇజ్రాయెల్​కు చెందిన సైబర్ ఇంటెలిజెన్స్ సంస్థ ఎన్​ఎస్​ఓ గ్రూప్​ వెల్లడించింది. దీని ద్వారా హ్యాకర్లు స్పై వేర్​లను పంపించి డేటా చౌర్యానికి పాల్పడే అవకాశం ఉందని వెల్లడించారు. అయితే ఈ బగ్​ను గుర్తించిన వాట్సాప్ వెంటనే దానిని పరిష్కరించినట్లు తెలిపింది.

ఇదీ చూడండి: అదిరే ఫీచర్లతో రియల్​మీ కొత్త మోడళ్లు

ABOUT THE AUTHOR

...view details