తెలంగాణ

telangana

ETV Bharat / business

13 నిమిషాల్లోనే ఫుల్​ ఛార్జింగ్... వివో కొత్త టెక్

స్మార్ట్​ఫోన్లలోనే కాదు.. ఛార్జింగ్​ టెక్నాలజీతోనూ స్మార్ట్​ ప్రియుల్ని అబ్బురపరుస్తోంది వివో. 120 వాట్స్​ సూపర్​ ఫ్లాష్​ ఛార్జ్​తో 4000 ఎంఏహెచ్​ సామర్థ్యం గల ఫోన్ బ్యాటరీని కేవలం 13 నిమిషాల్లోనే ఛార్జ్​ చేయవచ్చు. చైనా షాంఘైలో జరుగుతున్న ​మొబైల్ వరల్డ్​ కాంగ్రెస్​లో దీనిని ఆవిష్కరించింది.

By

Published : Jun 28, 2019, 1:51 PM IST

13 నిమిషాల్లోనే బ్యాటరీ ఫుల్​.. వివో ఆవిష్కరణ

స్మార్ట్​ఫోన్​ రంగంలో ప్రత్యర్థులకు పోటీగా వివో సరికొత్త ఆవిష్కరణతో ముందుకొచ్చింది. 120 వాట్​ అల్ట్రా ఫాస్ట్​ ఛార్జింగ్​ టెక్నాలజీని ఆవిష్కరించింది. ఈ సదుపాయంతో 4000 ఎంఏహెచ్​ సామర్థ్యం ఉన్న మొబైల్​ బ్యాటరీని కేవలం 13 నిమిషాల్లోనే ఛార్జ్​ చేయవచ్చు.

చైనాలోని షాంఘైలో జరుగుతున్న మొబైల్​ వరల్డ్​ కాంగ్రెస్​లో అధునాతన టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చింది చైనీస్​ దిగ్గజ స్మార్ట్​ఫోన్​ తయారీదారు.

50 శాతం ఛార్జింగ్​ కావాలంటే కేవలం 5 నిమిషాలు చాలు. మిగతా సగం చార్జింగ్​కు మరో 8 నిమిషాలు పడుతుంది. వివో కంటే ముందు షామీ కంపెనీ ‘100 వాట్స్‌ సూపర్‌ ఛార్జ్‌ టర్బో’ టెక్నాలజీని పరిచయం చేసింది. దీంతో 4,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఫోన్‌ని 17 నిమిషాల్లో ఛార్జ్‌ చేయవచ్చు. తాజా ఆవిష్కరణతో చైనాకే చెందిన షామీని అధిగమించింది వివో.

5జీ స్మార్ట్​ఫోన్​తో...

వివో తొలి 5జీ స్మార్ట్​ఫోన్​ను ప్రదర్శించింది. దీనిని 2019-20 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో అందుబాటులోకి తీసుకురానుంది. ఇంకా వివో 5జీ క్లౌడ్ గేమ్, 5జీ స్క్రీన్ మిర్రరింగ్ వంటి అప్లికేషన్స్‌ను ఆవిష్కరించింది. ప్రత్యేకించి 5జీ క్లౌడ్ గేమ్‌తో హైక్వాలిటీ గేమ్స్ ఆడుకోవచ్చు.

ABOUT THE AUTHOR

...view details