బడ్జెట్ విమానయాన సంస్థ 'విస్తారా' వచ్చే నెల నుంచి అంతర్జాతీయ విమానసేవలు ప్రారంభించనుంది. ఈ మేరకు విస్తారా సంస్థను సంయుక్తంగా నిర్వహిస్తున్న టాటా సన్స్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ సంస్థలు అధికారిక ప్రకటన చేశాయి.
ఆగస్టు నుంచి ప్రతి రోజు దిల్లీ-సింగపూర్, ముంబయి-సింగపూర్‌లకు విమాన సేవలు అందుబాటులో ఉంటాయని విస్తారా వెల్లడించింది. దిల్లీ నుంచి సింగపూర్‌కు మొదటి విమానం ఆగస్టు 6న బయల్దేరనుండగా, ముంబయి నుంచి ఆగస్టు 7న సేవలు ప్రారంభం కానున్నట్లు వెల్లడించింది. దిల్లీ కేంద్రంగా సేవలందిస్తున్న విస్తారా ప్రస్తుతం దేశవ్యాప్తంగా 24 గమ్యస్థానాలకు విమానాలను నడిపిస్తోంది.