తెలంగాణ

telangana

ETV Bharat / business

అమెజాన్​: ఇకపై హిందీలోనూ 'అలెక్సా' సేవలు - హిందీ

భారత యూజర్లకు అమెజాన్ ఇండియా మరో అద్భుత ఫీచర్​ను అందుబాటులోకి తెచ్చింది. అమెజాన్​ వాయిస్​ అసిస్టెంట్​ 'అలెక్సా' సేవలను హిందీలోనూ పొందొచ్చని వెల్లడించింది.

అమెజాన్​: ఇకపై హిందీలోనూ 'అలెక్సా' సేవలు

By

Published : Sep 18, 2019, 9:09 PM IST

Updated : Oct 1, 2019, 3:05 AM IST

టీవీల్లో.. 'అలెక్సా.. ప్లే ది సాంగ్​' అంటూ ఆంగ్ల భాషలో యాడ్​లు దర్శనమిస్తుంటాయి. ఇప్పటి నుంచి హిందీలోనూ అలెక్సాను పలకరించవచ్చు.

ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్.. తన వాయిస్ అసిస్టెంట్​ 'అలెక్సా'లో కొత్త అప్​డేట్​ తీసుకొచ్చింది. ఈ కొత్త అప్​డేట్ ద్వారా​ హిందీలో అలెక్సాకు కమాండ్​ ఇచ్చి.. కావాల్సిన సేవల్ని పొందొచ్చని అమెజాన్​ ఇండియా ప్రకటించింది.

అలెక్సా సేవలను 2017లో ప్రారంభించింది అమెజాన్. తెలుగు, తమిళం, హిందీ, మరాఠీ, పంజాబీలోని ప్రఖ్యాత ప్రాంతాలు, పాటల పేర్లను అలెక్సా గుర్తించగలదు. అయితే యూజర్లు ఇచ్చే కమాండ్లు ఇంగ్లీష్​లో మాత్రమే అర్థం చేసుకునేది.

తాజా అప్​డేట్​తో ఇకపై హిందీలో కమాండ్లు ఇచ్చినా అలెక్సా అర్థం చేసుకోగలదు. అమెజాన్​ అలెక్సా వాయిస్​ అసిస్టెంట్​.. యాపిల్ అసిస్టెంట్ సిరి, గూగుల్ అసిస్టెంట్​లకు గట్టిపోటీ ఇస్తోంది. అమెజాన్​ స్పీకర్​ వంటి ఉత్పత్తులు సహా.. బాస్​, మై బాక్స్, ఐ బాల్​, సిస్కా వంటి పరికరాల్లోనూ అలెక్సా సేవలు అందుబాటులో ఉన్నాయి.
అలెక్సాలో హిందీ భాషను తీసుకురావడానికి సంస్థ జట్టుతో పాటు ఎంతో మంది అమెజాన్ యూజర్ల సహాయం అందించారని అమెజాన్​ ఇండియా ఉపాధ్యక్షుడు రోహిత్​ ప్రసాద్​ తెలిపారు. హిందీ పదజాలాన్ని ఎలా పలికినా అలెక్సా అర్థం చేసుకోగలదని చెప్పారు.

"భారత​ సంప్రదాయ, భాష సంబంధిత వైవిధ్యంతో మేము గట్టి సవాలు ఎదుర్కొన్నాం. అయినప్పటికీ.. వివిధ ప్రాంతాల్లోని హిందీ మాట్లాడే వారి మాటలను సులభంగా అర్థం చేసుకునే విధంగా అలెక్సాలో అప్​డేట్​ తీసుకొచ్చాం." -రోహిత్​ ప్రసాద్,అమెజాన్​ ఇండియా ఉపాధ్యక్షుడు.

ఇదీ చూడండి: పెట్రోల్, డీజిల్​ ధరలు పైపైకి.. ఒక్కరోజే..!

Last Updated : Oct 1, 2019, 3:05 AM IST

ABOUT THE AUTHOR

...view details