తెలంగాణ

telangana

ETV Bharat / business

'2027 నాటికి ఉద్యోగాల్లో లింగభేదం కనుమరుగు' - ఉద్యోగ అవకాశాలు

దేశవ్యాప్తంగా దిగ్గజ కంపెనీల్లో మరో ఎనిమిదేళ్లలో మహిళలు, పురుషుల ఉద్యోగుల సంఖ్య సమంగా ఉంటుందని ఓ సర్వే వెల్లడించింది. వేతనాల ప్రకారం కార్పొరేట్​ సంస్థల్లో లింగ సమానత్వం ప్రస్తుతం 86శాతం ఉందని పేర్కొంది.

లింగసమానత్వం

By

Published : Sep 18, 2019, 5:15 AM IST

Updated : Oct 1, 2019, 12:39 AM IST

దేశంలో ఉద్యోగం చేసే మహిళల సంఖ్య.. 2027 నాటికి పురుషుల సంఖ్యతో సమానంగా ఉంటుందని ఓ నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఉన్న 100 దిగ్గజ కంపెనీలపై చేసిన సర్వే ద్వారా.. వర్కింగ్​ మదర్​, అవతార్ 100 బీసీడబ్ల్యూఐ సంస్థలు ఈ విషయాన్ని వెల్లడించాయి.

నివేదిక ప్రకారం.. 2018లో 31 శాతంగా ఉన్న మహిళా ఉద్యోగుల సంఖ్య.. ఈ ఏడాది (ఇప్పటివరకు) 33 శాతానికి పెరిగిందని అవతార్​ గ్రూప్​ అధ్యక్షురాలు సౌందర్య రాజేష్​ తెలిపారు.

"ప్రస్తుతం దేశంలోని 100 దిగ్గజ కంపెనీల్లో 4.9 లక్షల మహిళా ఉద్యోగులు ఉన్నారు. లింగ ప్రాతిపాదికన ఆ కంపెనీల్లో మహిళల శాతం 33. 2027 నాటికి మహిళల ప్రాతినిథ్యం.. పురుషులతో సమానంగా ఉంటుంది. " -సౌందర్య రాజేశ్​, అవతార్​ గ్రూప్​ అధ్యక్షురాలు

మహిళలకు అవకాశాలు (రంగాల వారీగా)

కన్సల్టింగ్​ రంగంలో 44 శాతం, బ్యాంకింగ్, ఆర్థిక కార్యకలాపాల రంగంలో 41 శాతం, ఐటీ సెక్టార్​లో 36 శాతం మహిళలకు ఉద్యోగావకాశాలున్నాయని నివేదిక పేర్కొంది.
బ్యాంకింగ్​, ఆర్థిక కార్యకలాపాలు, బీమా రంగాల్లో మహిళలకు పెరుగుతున్న అవకాశాలతో 2020 నాటికి ఈ సంఖ్య 40 శాతానికి చేరుకునే అవకాశముందని నివేదిక అంచనా వేసింది.

10 అత్యుత్తమ కంపెనీల్లో 80 శాతం, 100 ఉత్తమ కంపెనీల్లో 53 శాతం మహిళలకు రెండోసారి ఉద్యోగ అవకాశాలు ఇచ్చేందుకు మొగ్గుచూపుతున్నాయి. 2017లో ఇది 40 శాతం మాత్రమే.

2018 వేతనాల విషయానికొస్తే.. ఉత్తమ 100 కంపెనీల్లో 86 శాతం కంపెనీలు పురుషులతో సమానంగా మహిళలకు వేతనం ఇచ్చేందుకు మొగ్గుచూపుతున్నాయని సర్వే పేర్కొంది.

ఇదీ చూడండి: ఫేస్​బుక్​, ఇన్​స్టాలో కొత్త ఫీచర్లు.. ఏంటో తెలుసా?

Last Updated : Oct 1, 2019, 12:39 AM IST

ABOUT THE AUTHOR

...view details