టిక్‌టాక్ అమెరికా కార్యకలాపాల విక్రయానికి టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌కు బదులు ఒరాకిల్ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంతో సంబంధమున్న వర్గాల ద్వారా ఈ విషయం తెలిసింది. టిక్‌టాక్ కొనుగోలు రేసులో మైక్రోసాఫ్ట్ మొదటి నుంచి ప్రధానంగా ఉంది. అయితే తమ బిడ్‌ను టిక్‌టాక్ తిరస్కరించినట్లు మైక్రోసాఫ్ట్ ఆదివారం అధికారికంగా ప్రకటించడం గమనార్హం.
ఆ తర్వాత తాజా పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే ఈ విషయంపై.. ఇటు ఒరాకిల్ గానీ, అటు టిక్‌టాక్ గానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.