చైనాకు చెందిన మొబైల్ వీడియో యాప్ టిక్‌టాక్... ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల కోసం రూ.1900 కోట్లు విరాళం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. కరోనా మహమ్మారితో ఎక్కువగా ప్రభావితమైన వారి కోసం ఈ నిధులు ఇస్తున్నట్లు పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా ఇతర సంస్థల ద్వారా భారత్, ఇటలీ వంటి దేశాల్లో వైద్య సేవల కోసం రూ.1140 కోట్లు కేటాయించనున్నట్లు తెలిపింది.
కరోనాపై పోరుకు టిక్‌టాక్ రూ.1900 కోట్ల విరాళం - టిక్‌టాక్
ప్రపంచవ్యాప్తంగా కరోనాపై పోరుకు చైనాకు చెందిన మొబైల్ యాప్ టిక్‌టాక్ భారీ విరాళం ప్రకటించింది. రూ. 1900 కోట్లు ఇవ్వనున్నట్లు తెలిపింది.
ఆర్థికంగా నష్టపోయిన కళాకారులు, కమ్యూనిటీ రిలీఫ్ ఫండ్, ప్రపంచవ్యాప్తంగా దూరవిద్యకు తోడ్పడటానికి, సృజనాత్మక అభ్యాసనిధికి మిగతా నిధులు ఖర్చు చేయనున్నట్లు వివరించింది. కరోనా మహమ్మారి వ్యాప్తి నివారణకు తమ వంతు సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని టిక్‌టాక్ అధ్యక్షుడు అలెక్స్ జూ తెలిపారు. ఇప్పటికే గూగుల్, ఫేస్‌బుక్, ట్విట్టర్ సహా ఇతర సామాజిక మాధ్యమ సంస్థలువిరాళాలు ప్రకటించగా తాజాగా టిక్‌టాక్ వాటి సరసన చేరింది.
ఇదీ చూడండి:ఐటీ ఉద్యోగాలకు అనువైన నగరాల్లో 'హైదరాబాద్' రెండో స్థానం