తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆ కంపెనీల ఉద్యోగులకు వర్క్​ ఫ్రం హోం బంద్! - వర్క్​ ఫ్రం హోంపై కంపెనీల అభిప్రాయాలు

కరోనా కారణంగా చాలా కంపెనీల ఉద్యోగులు ఏడాదిన్నరకుపైగా వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే దేశంలో కరోనా కేసులు (Corona Cases in India) తగ్గుముఖం పడుతున్నాయి. మరి కంపెనీలు త్వరలోనే వర్క్​ ఫ్రం హోం (End to Work form home) తొలగించనున్నాయా? ప్రస్తుత పరిస్థితుల్లో ఆఫీస్​కు తిరిగి వెళ్లేందుకు ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారా?

Companies to Say good bye to work from home
వర్క్ ఫ్రం హోంకు గుడ్​బై

By

Published : Sep 30, 2021, 2:41 PM IST

దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం (Carona case in India) పడుతున్నాయి. ఇదే సమయంలో వ్యాక్సినేషన్ (COVID vaccination in India)​ ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. ఈ పరిణామాలన్నీ త్వరలోనే సాధారణ పరిస్థితులు నెలకొంటాయనే ఆశలు పెంచుతున్నాయి. దీనితో కార్పొరేట్​ ప్రపంచంలో కూడా సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. దిగ్గజ సంస్థలన్నీ తమ ఉద్యోగుల వర్క్​ ఫ్రం హోంకు (End to Work form home) ముగింపు పలికి.. వారిని ఆఫీస్​లకు తిరిగి రప్పించేందుకు కసరత్తు చేస్తున్నాయి.

నెస్లే ఇండియా, టాటా కన్స్యూమర్స్​, ఆమ్వే, డాబర్​, గోద్రెజ్​ వంటి సంస్థలు.. ఈ విషయంలో ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆయా కంపెనీలు వర్క్ ఫ్రం హోం, ఆఫీస్​లో పని, హైబ్రిడ్ మోడళ్లలో ఏదో ఒక దాన్ని ఐచ్ఛికంగా ఎంచుకునే అవకాశమివ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఆ కంపెనీలు ఇప్పటికే ప్రకటన..

తమ ఉద్యోగుల్లో 90 శాతం మందిని ఈ ఏడాది చివరి నాటికి ఆఫీస్​లకు రప్పించాలని భావిస్తున్నట్లు.. టెక్ దిగ్గజం టీసీఎస్​ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్) సీఈఓ రాజేశ్​ గోపినాథ్​ ఇటీవలే ప్రకటించారు. అయితే 2025 నాటికి నాటికి 25 శాతం మంది ఉద్యోగులను వర్క్​ ఫ్రం హోం చేసేందుకు అనుమతిస్తామని వెల్లడించారు.

రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న ఉన్నత స్థాయి ఉద్యోగులు.. వారంలో రెండు రోజులు ఆఫీస్​లో పని చేస్తున్నట్లు విప్రో ఈ నెలలోనే ప్రకటించింది. ఇన్ఫోసిస్​ వంటి ఇతర టెక్​ దిగ్గజాలు కూడా.. టీసీఎస్​ మోడల్​ను అనుసరించే అవకాశముందని తెలుస్తోంది.

కోటక్ మహీంద్రా బ్యాంక్​, యాక్సిస్​ బ్యాంక్, ఎస్ బ్యాంక్, డెలాయిట్​ వంటి సంస్థలు రానున్న రెండు నెలల్లో తమ ఉద్యోగుల్లో 90 శాతం మందిని ఆఫీస్​లకు రప్పించే ఆస్కారముంది. ఇప్పటికే కోటక్ మహీంద్రా బ్యాంక్​ రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న ఉద్యోగులను ఆఫీస్​కు రావాలని ఆదేశించింది.

ఉద్యోగులు ఏమనుకుంటున్నారు?

దేశవ్యాప్తంగా ఉద్యోగులపై చేసిన ఓ సర్వే ద్వారా లింక్డ్​ఇన్​ కీలక విషయాలను వెల్లడించింది. దేశంలో ఎక్కువమంది ఉద్యోగులు.. వృత్తి, వ్యక్తిగత జీవితానికి సమ ప్రాధాన్యమివ్వాలంటే.. హైబ్రిడ్​ వర్క్ తప్పనిసరి అని అభిప్రాయపడుతున్నట్లు తెలిసింది.

డెలాయిట్​ చేసిన మరో సర్వేలో 84 శాతం మంది ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లడం సురక్షితమేనని భావిస్తున్నట్లు తెలిసింది.

ఇదీ చదవండి:ఆన్​లైన్​ షాపింగ్​ చేసే వారి కోసం.. ఎస్​బీఐ బంపర్​ ఆఫర్​!

ABOUT THE AUTHOR

...view details