ప్రైవేటు రంగ స్టీల్ ఉత్పత్తి దిగ్గజం 'టాటా స్టీల్' ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. 2020-21కి గానూ వార్షిక బోనస్ కింద రూ.270.28 కోట్లు కేటాయించినట్లు తెలిపింది. టాటా స్టీల్లోని అన్ని విభాగాలు, యూనిట్లలోని అర్హులైన ఉద్యోగులందరికీ ఈ బోనస్ వర్తిస్తుందని పేర్కొంది.
దీనికి సంబంధించి టాటా స్టీల్, టాటా వర్కర్స్ యూనియన్ మధ్య బుధవారమే సెటిల్మెంట్ ఒప్పందం కుదిరింది. ఇదే కాకుండా.. జంషెట్పుర్లోని ట్యూబ్స్ సహా వేర్వేరు డివిజన్లు రూ.158.31 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి.