తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆ వాహన సంస్థలో 1,000 ఉద్యోగాలు కోత! - జాగ్వార్ ల్యాండ్​రోవర్​లో ఉద్యోగాల కోత

టాటా మోటార్స్ అనుబంధ సంస్థ జాగ్వార్​, ల్యాండ్​రోవర్ భారీగా ఉద్యోగాల కోతకు సిద్ధమైంది. కరోనా సంక్షోభం నేపథ్యంలో ఖర్చులు తగ్గించుకునేందుకు 1,000కి పైగా ఉద్యోగులను తొలగించాలని భావిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

jobs cut in jlr
టాటా మోటార్స్​లో ఉద్యోగాల కోత

By

Published : Jun 16, 2020, 3:21 PM IST

కరోనా మహమ్మారి సృష్టించిన సంక్షోభ ప్రభావంతో దిగ్గజ సంస్థలూ కుదేలవుతున్నాయి. ఈ నేపథ్యంలో చాలా సంస్థలు ఉద్యోగాల కోత వంటి కఠినమైన నిర్ణయాలతో ఖర్చులు తగ్గించుకునే పనిలో పడ్డాయి. ఈ జాబితాలో దిగ్గజ వాహన సంస్థ టాటా మోటార్స్​కు చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ జాగ్వార్, ల్యాండ్​రోవర్ (జేఎల్​ఆర్)​ చేరింది

లండన్​ కేంద్రంగా పని చేస్తున్న జేఎల్​ఆర్ దాదాపు 1,000 ఉద్యోగాల కోత విధించాలని చూస్తోంది. కరోనా కారణంగా విధించిన లాక్​డౌన్​తో తమ విక్రయాలు 30.9 శాతం పడిపోయినట్లు ప్రకటించింది. ఈ కారణంగానే ఉద్యోగాల కోత ద్వారా ఖర్చులు తగ్గించుకోవాలని భావిస్తోంది.

ముఖ్యంగా బ్రిటన్​లో ఉన్న తమ ప్లాంట్లలోని కాంట్రాక్ట్ ఏజెన్సీ ఉద్యోగులను తగ్గించుకోవాలని చూస్తున్నట్లు జేఎల్​ఆర్ తెలిపింది. జులై చివరి నుంచి ఈ ఏడాది చివరి వరకు ఉద్యోగాల కోత ప్రక్రియ కొనసాగనున్నట్లు వెల్లడించింది.

ఇదీ చూడండి:విమాన సంస్థలకు షాక్.. భారీగా పెరిగిన ఏటీఎఫ్ ధరలు

ABOUT THE AUTHOR

...view details