తెలంగాణ

telangana

By

Published : Jun 23, 2020, 9:51 AM IST

ETV Bharat / business

ట్రంప్​ నిర్ణయం నిరాశపరిచింది: సుందర్​ పిచాయ్​

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​పై గూగుల్​ సీఈఓ అసహనం వ్యక్తం చేశారు. హెచ్​-1బీ వీసాలను ఈ ఏడాది చివరి వరకు నిలిపివేస్తునట్టు ట్రంప్​ చేసిన ప్రకటనతో తీవ్ర నిరాశ చెందినట్టు ట్వీట్​ చేశారు.

Sunder Pichai disappointed by Trump's immigration proclamation
ట్రంప్​ నిర్ణయంతో తీవ్ర నిరాశ చెందా: సుందర్​ పిచాయ్​

హెచ్​-1బీ వీసాలను ఈ ఏడాది చివరి వరకు నిలిపివేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ తీసుకున్న నిర్ణయంపై గూగుల్​ సీఈఓ సుందర్​ పిచాయ్​ నిరాశ వ్యక్తం చేశారు. వలసదారుల వల్లే అగ్రరాజ్యం ఈ స్థాయిలో ఉందని ట్వీట్​ చేశారు.

"అమెరికా ఆర్థిక వ్యవస్థ విజయంలో ఇమిగ్రేషన్​ కీలక పాత్ర పోషించింది. ఇమిగ్రేషన్​ వల్లే సాంకేతిక రంగంలో అమెరికా ప్రపంచస్థాయికి ఎదిగింది. గూగుల్​ కంపెనీ కూడా ఈ స్థాయిలో ఉండటానికి కారణం అదే. ట్రంప్​ నిర్ణయంతో నిరాశ చెందా. వలసదారులకు అండగా ఉంటాం. అందరికీ అవకాశం లభించేలా చూస్తాం."

-- సుందర్​ పిచాయ్​, గూగుల్​ సీఈఓ

ట్రంప్​ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. లీడర్​షిప్​ కాన్ఫరెన్స్​ ఆన్​ సివిల్​ అండ్​ హ్యుమ్​ రైట్స్ (ఎల్​సీసీహెచ్​)​ సీఈఓ వనితా గుప్తా.. అధ్యక్షుడి నిర్ణయంపై మండిపడ్డారు.

"తాజా నిర్ణయంతో ట్రంప్​ మరోసారి జాతి వివక్ష వైఖరిని ప్రదర్శించారు. అయితే వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి అధ్యక్షుడు చేపట్టే చర్యలు పనిచేయవు. వలసదారులకు ఆయన చేసిన అన్యాయాన్ని కోర్టులు అడ్డుకుంటాయి."

--- వనితా గుప్తా, ఎల్​సీసీహెచ్​ సీఈఓ.

అమెరికాలో ప్రత్యేక వృత్తుల్లో తాత్కాలికంగా పని చేయడానికి ఈ వీసా ఉపయోగపడుతుంది. కరోనా సంక్షోభం కారణంగా నిరుద్యోగం రికార్డు స్థాయిలో పెరిగిన నేపథ్యంలో అమెరికన్లకు అవకాశాలు కల్పించాలనే ట్రంప్​ ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details