ప్రపంచ వృద్ధిపై అనుమానాల మధ్య దేశీయ స్టాక్‌మార్కెట్లు స్వల్ప నష్టాలతో ట్రేడవుతున్నాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెనెక్స్ ప్రస్తుతం 15 పాయింట్లు కోల్పోయి 38,925 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 3 పాయింట్ల స్వల్ప నష్టంతో 11,669 వద్ద ట్రేడవుతోంది.
ఇవీ కారణాలు
2019లో ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు 3.3శాతానికి పరిమితం అవుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి అంచనా వేసింది.
ఈ లెక్కలు మదుపర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఆర్థిక, సాంకేతిక రంగాల వాటాలు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి.
అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం, బ్రెగ్జిట్ ప్రభావం కూడా స్టాక్ మార్కెట్లలో నష్టాలకు కారణమే.
సెన్సెక్స్‌లో కోల్ ఇండియా, ఓఎన్జీసీ, టాటా స్టీల్, ఎం అండ్ ఎం, హెచ్‌యూఎల్, టాటా మోటార్స్ లాభాల్లో ట్రేడవుతున్నాయి.
టీసీఎస్, హీరో మోటార్స్, హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, మారుతీ, ఐటీసీ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.