తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆర్థిక రంగం అండతో సానుకూల ట్రేడింగ్​ - సెన్సెక్స్​

స్టాక్​ మార్కెట్ల వారాంతపు ట్రేడింగ్​ లాభాల్లో కొనసాగుతోంది. 145 పాయింట్లు బలపడిన సెన్సెక్స్​.. తిరిగి 39 వేల మార్కుకు చేరుకుంది. నిఫ్టీ 30 పాయింట్లు ఎగబాకింది.

స్టాక్​మార్కెట్లు

By

Published : May 3, 2019, 9:47 AM IST

Updated : May 3, 2019, 11:01 AM IST

స్టాక్​ మార్కెట్లు నేడు సానుకూలంగా ట్రేడవుతున్నాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 145.84 పాయింట్లు బలపడి 39,127.27 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 30.10 పాయింట్ల స్వల్ప లాభంతో 11,754.85 పాయింట్ల వద్ద ఉంది.

ఇవీ కారణాలు

ఆర్థిక, వాహన రంగాల్లో సాగుతున్న కొనుగోళ్లు మార్కెట్లకు కలిసొచ్చింది. విదేశీ పెట్టుబడులు రావటం, చమురు ధరలు అదుపులో ఉండటం సానుకూల ట్రేడింగ్​కు కారణం.

లాభానష్టాల్లోనివే

సెన్సెక్స్​లో టాటా మోటార్స్​, భారతీ ఎయిర్​టెల్​, కొటక్​ బ్యాంకు, ఎన్​టీపీసీ, కోల్​ ఇండియా, మారుతి షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

హెచ్​సీఎల్​ టెక్​, టీసీఎస్​, టాటా స్టీల్, వేదాంత​, హెచ్​యూఎల్​, ఇన్ఫోసిస్​ షేర్లు నష్టాల్లో సాగుతున్నాయి.

రూపాయి, ముడి చమురు

ఆరంభ ట్రేడింగ్​లో రూపాయి స్వల్పంగా పుంజుకుంది. డాలర్​తో పోలిస్తే రూపాయి 69.28 వద్ద ట్రేడవుతోంది.

ముడి చమురు ధరల సూచీ బ్రెంట్​ 0.40 శాతం తగ్గి.. బ్యారెల్​ ముడి చమురు ధర 70.47 డాలర్లుగా కొనసాగుతోంది.

ఇతర మార్కెట్లు ఇలా

ఆసియాలోని ఇతర ప్రధాన మార్కెట్లు.... కొరియా సూచీ కోస్పి, హంకాంగ్​ సూచీ హంగ్​ సెంగ్​లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. చైనా, జపాన్ స్టాక్​ మార్కెట్లకు నేడు సెలవు.

Last Updated : May 3, 2019, 11:01 AM IST

ABOUT THE AUTHOR

...view details