స్టాక్ మార్కెట్లు లాభాల జోరుకు ఆరంభంలోనే ఆటంకం ఏర్పడింది. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ ప్రస్తుతం 59.63 పాయింట్ల నష్టంతో 39,216.01 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 21.35 పాయింట్ల నష్టంతో 11,765.80 వద్ద కొనసాగుతోంది.
గత సెషన్లో వచ్చిన భారీ లాభాల కారణంగా స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయిలను నమోదు చేశాయి. ఈ ఉదయం లాభాలతో ప్రారంభమైనప్పటికీ... మదుపరులు ఎక్కువగా లాభాల స్వీకరణకు మొగ్గు చూపుతున్నారు.
వీటికి తోడు ఇతర ప్రధాన ఆసియా మార్కెట్లు ప్రారంభం నుంచే నష్టాల్లో ట్రేడవుతుండటం మదుపరుల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.