తెలంగాణ

telangana

ETV Bharat / business

మార్కెట్లను ముంచిన వాణిజ్య యుద్ధ భయాలు

అమెరికా-చైనా వాణిజ్య యుద్ధ భయాలు మార్కెట్లకు రికార్డు స్థాయి నష్టాలను మిగిల్చాయి. సెన్సెక్స్​ 487.50 పాయింట్లు పతనమైంది. నిఫ్టీ 138.45 పాయింట్లు కోల్పోయింది.

స్టాక్ మార్కెట్లు

By

Published : May 8, 2019, 4:06 PM IST

Updated : May 8, 2019, 4:49 PM IST

వరుసగా ఆరో సెషన్​లో భారీ నష్టాలను నమోదు చేశాయి స్టాక్​ మార్కెట్లు.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్​ 487.50 పాయింట్లు పతనమై 38 వేల మార్కును కోల్పోయింది. సెషన్ ముగిసే సమయానికి 37,789.13 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 138.45 పాయింట్ల నష్టానికి కీలక 11,400 స్థాయిని కోల్పోయింది. చివరకు 11,359.45 వద్ద ట్రేడింగ్​ ముగించింది.

ఇదీ కారణం

అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం ముదురుతోన్న నేపథ్యంలో మదుపరులు పెట్టబడులు పెట్టేందుకు మొగ్గుచూపడం లేదు. ఇవే భయాలతో విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ కారణంగా ఇంధన, ఆర్థిక రంగ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. మిగిలిన అన్ని రంగాలదీ అదే తీరు.

దేశీయ సంస్థల త్రైమాసిక ఫలితాలు అంతంత మాత్రంగానే ఉండటం భారీ నష్టాలకు మరో కారణం.

ఇంట్రాడే సాగిందిలా

సూచీ గరిష్ఠం కనిష్ఠం
సెన్సెక్స్ 38,248.57 37,743.07
నిఫ్టీ 11,479.10 11,346.95

లాభనష్టాలు

సెన్సెక్స్​లో కీలక 30 షేర్లలో ఏషియన్​ పెయింట్స్​ 0.60 శాతం, హెచ్​సీఎల్​టెక్​ 0.29 శాతం, టీసీఎస్​ 0.11 శాతం లభాలను నమోదు చేశాయి.
ఈ మూడు సంస్థల షేర్లు తప్ప మిగతా 27 షేర్లు నష్టాల్లో ముగిశాయి.

అత్యధికంగా రిలయన్స్ 3.35 శాతం, బజాజ్​ ఫినాన్స్​ 3.22 శాతం, టాటా మోటార్స్ 2.80 శాతం, బజాజ్ ఆటో 2.55 శాతం, ఎస్​బీఐ 2.53 శాతం, వేదాంత 2.51 శాతం నష్టపోయాయి. మిగతా షేర్లు దాదాపు ఒక శాతం నష్టాన్ని మూటగట్టుకున్నాయి.

ఇతర మార్కెట్లు ఇలా..

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లు నేడు భారీ నష్టాల్లో ముగిశాయి. షాంఘై సూచీ 1.12 శాతం, హాంకాంగ్​ సూచీ-హాంగ్ సెంగ్​ 1.23 శాతం, జపాన్ సూచీ-నిక్కీ1.46 శాతం, దక్షిణ కొరియా సూచీ-కోస్పీ 0.41 శాతం నష్టాలను నమోదు చేశాయి.

రూపాయి, ముడిచమురు

సెషన్ ముగింపు ట్రేడింగ్​లో రూపాయి 19 పైసలు బలహీనపడింది. డాలర్​తో రూపాయి మారకం విలువ 69.59కు చేరింది.

ముడి చమురు ధరల బ్రెంట్​ సూచీ 0.41 శాతం తగ్గింది. బ్యారెల్​ ముడి చమురు ధర 69.59 డాలర్లుగా ఉంది.

Last Updated : May 8, 2019, 4:49 PM IST

ABOUT THE AUTHOR

...view details