తెలంగాణ

telangana

ETV Bharat / business

ఐదో రోజూ లాభాలే.. మళ్లీ 39 వేలు దాటిన సెన్సెక్స్ - నేటి స్టాక మార్కెట్ వివరాలు

స్టాక్ మార్కెట్లు నేడు భారీ లాభాలతో ముగిశాయి. బ్యాంకింగ్, వాహన రంగాలు... లాభాలకు దన్నుగా నిలిచాయి. సెన్సెక్స్ 453 పాయింట్ల వృద్ధితో తిరిగి 39 వేల మార్క్​ను దాటింది. నిఫ్టీ 122 పాయింట్లు బలపడింది.

స్టాక్ మార్కెట్​ వార్తలు

By

Published : Oct 17, 2019, 4:13 PM IST

వరుసగా ఐదో రోజు స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయంగా వస్తోన్న సానుకూలతలకు తోడు దేశీయంగా కార్పొరేట్ల త్రైమాసిక ఫలితాలు మెప్పిస్తుండటం లాభాలకు ప్రధాన కారణం. బ్యాంకింగ్, వాహన రంగల్లో మదుపరులు భారీగా కొనుగోళ్లు జరిపారు.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 453 పాయింట్లు పుంజుకుంది. చివరకు 39,052 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 122 పాయింట్లు పెరిగి..11,586 వద్దకు చేరింది.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్​ 39,105 పాయింట్ల గరిష్ఠాన్ని తాకగా.. 38,557 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.
నిఫ్టీ నేడు 11,599 పాయింట్ల అత్యధిక స్థాయి.. 11,440 పాయింట్ల అత్యల్ప స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

ఎస్ బ్యాంక్​ అత్యధికంగా 15.19 శాతం లాభపడింది. టాటా మోటార్స్ 9.82 శాతం, ఇండస్​ఇండ్​ బ్యాంక్​ 5.18 శాతం, బజాజ్ ఆటో 3.89 శాతం, ఎస్​బీఐ 3.73 శాతం లాభాలను ఆర్జించాయి.
హెచ్​సీఎల్​ టెక్, వేదాంతలు 1.04 శాతం, పవర్ గ్రిడ్ 0.63 శాతం, కోటక్ బ్యాంకు 0.31 శాతం, ఇన్ఫోసిస్ 0.30 శాతం నష్టాలను మూటగట్టుకున్నాయి.

ఇదీ చూడండి: 'త్వరలోనే కశ్మీర్​లో పెట్టుబడులకు నూతన విధానం'

ABOUT THE AUTHOR

...view details