తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆర్థిక, వాహన రంగాల సానుకూలత- లాభాల్లో సూచీలు

కొనుగోళ్ల మద్దతుతో స్టాక్ మార్కెట్లు నేడు సానుకూలంగా స్పందిస్తున్నాయి. ప్రధానంగా బ్యాంకింగ్, వాహన రంగ షేర్లు లాభాల్లో ఉన్నాయి. సెన్సెక్స్ 132 పాయింట్లు పుంజుకుంది. నిఫ్టీ 38 పాయింట్లు బలపడింది.

స్టాక్​ మార్కెట్లు

By

Published : Sep 11, 2019, 9:45 AM IST

Updated : Sep 30, 2019, 5:02 AM IST

స్టాక్ మార్కెట్లు నేడు లాభాల్లో ట్రేడవుతున్నాయి. కేంద్రం ఉద్దీపనలపై ఆశలతో మదుపరులు కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు. వాహన రంగానికి ప్రోత్సాహం అందిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ ప్రకటించిన నేపథ్యంలో.. ఆ రంగాల షేర్లు సానుకూలంగా స్పందిస్తున్నాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 132 పాయింట్లు బలపడి. ప్రస్తుతం 37,728 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 38 పాయింట్ల లాభంతో 11,041 వద్ద కొనసాగుతోంది.

లాభనష్టాల్లోనివివే..

ఎస్​బ్యాంకు, టాటా మోటార్స్, టాటా స్టీల్, వేదాంత, ఎం&ఎం, ఇండస్​ఇండ్​ బ్యాంకు, బజాజ్ ఆటో, ఎస్​బీఐ షేక్లు లాభాల్లో ఉన్నాయి.
ఇన్ఫోసిస్​, మారుతి, కోటక్ బ్యాంకు, ఐటీసీ, టెక్​ మహీంద్రా, భారతీ ఎయిర్​టెల్​ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

Last Updated : Sep 30, 2019, 5:02 AM IST

ABOUT THE AUTHOR

...view details