తెలంగాణ

telangana

ETV Bharat / business

స్టాక్​ మార్కెట్లు డీలా- ఆర్థిక మాంద్యం తప్పదా!

ఆర్థిక మాంద్యంపై రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. కీలక రంగాల్లో మందగిస్తున్న వృద్ధి, స్టాక్ మార్కెట్ల పతనం, రూపాయి క్షీణత వంటి పరిణామాలు ఇందుకు ఉదాహరణగా నిలుస్తున్నాయి.

ఆర్థిక మాంద్యం తప్పదా

By

Published : Sep 4, 2019, 5:32 AM IST

Updated : Sep 29, 2019, 9:18 AM IST

స్టాక్ మార్కెట్లను ఆర్థిక మాంద్యం భయాలు వెంటాడుతున్నాయి. కీలక రంగాలల్లో వృద్ధి మందగించినట్లు వెలువడుతున్న గణాంకాలు, అంతర్జాతీయ పరిణామాలు.. మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి. మంగళవారం బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 770 పాయింట్లు కోల్పోయి.. చివరికి 36,563 వద్ద స్థిరపడింది. 225 పాయింట్లు క్షీణించిన జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ.. 10 వేల 798 వద్ద ముగిసింది.

ఇంట్రాడేలో దాదాపు 11 నెలల కనిష్ఠ స్థాయిని నమోదు చేశాయి సూచీలు. అటు రూపాయి 9 నెలల్లో ఎన్నడూ లేని విధంగా 97 పైసలు కోల్పోయింది. డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ 72.39 వద్దకు చేరింది.

దేశంలో ఎనిమిది కీలక రంగాల్లో వృద్ధి మందగించినట్లు ఇటీవలి అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. వీటికితోడు వాహన రంగ సంక్షోభం, అమెరికా-చైనా సుంకాల యుద్ధం వంటి ప్రతికూలతల నేపథ్యంలో అమ్మకాలవైపే ఆసక్తి చూపుతున్నారు మదుపరులు. గత సెషన్లో నమోదైన అమ్మకాలతో రూ.2.55 లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరైంది.

ఈ ప్రతికూల పరిణామాల నేపథ్యంలో ఒక్క ఐటీ రంగం మినహా మిగతా అన్ని రంగాలు భారీ నష్టాలు మూటగట్టుకున్నాయి. ఈ పరిణామాలన్నింటిని గమనిస్తే పలు ఆర్థిక నివేదికలు వెల్లడిస్తున్నట్లుగానే.. ఆర్థిక మాంద్యం వస్తుందనే అంచనాలు పెరిగిపోతున్నాయి.

మదుపరుల భయాలకు కారణాలివే..

  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి.. (ఆరేళ్ల కనిష్ఠం) 5 శాతంగా నమోదుకావడం.
  • దేశవ్యాప్తంగా ఎనిమిది కీలక పరిశ్రమల వృద్ధి జులైలో 2.1 శాతానికి పరిమితమైంది.
  • వినియోగం(ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో) తగ్గడం.

ఇదీ చూడండి: ఐడీబీఐకి రూ.9వేల కోట్ల మూలధనం

Last Updated : Sep 29, 2019, 9:18 AM IST

ABOUT THE AUTHOR

...view details