తెలంగాణ

telangana

ETV Bharat / business

మొబైల్ వారంటీ ముగుస్తుందా? అయినా ఫర్వాలేదు!

లాక్​డౌన్​ అమల్లో ఉన్నందున తమ ఉత్పత్తులకు వారంటీ గడువును పొడిగించాయి ప్రముఖ స్మార్ట్​ఫోన్​ కంపెనీలు. లాక్​డౌన్​ సమయంలో వారంటీ ముగిసే ఉత్పత్తులకు ఈ పొడిగింపు వర్తిస్తుందని పేర్కొన్నాయి.

BIZ-VIRUS-WARRANTY
మొబైల్ వారంటీ

By

Published : Mar 27, 2020, 1:30 PM IST

కరోనాను అరికట్టే చర్యల్లో భాగంగా దేశమంతా లాక్​డౌన్​ విధించింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో తమ ఉత్పత్తులకు వారంటీని పెంచాయి పలు మొబైల్ సంస్థలు. లాక్​డౌన్​ కాలంలో వారంటీ పూర్తయ్యే మొబైళ్లకు ఈ పొడిగింపు వర్తిస్తుంది.

ప్రముఖ స్మార్ట్​ఫోన్​ సంస్థలు హానర్, ఒప్పో, రియల్​మీ​ తమ ఉత్పత్తుల వారంటీ గడువును పొడిగించాయి.

"వారంటీ గడువును 2020 జూన్​ 30 వరకు పొడిగిస్తున్నాం. మార్చి 21, జూన్​ 21 మధ్య కాలంలో గడువు పూర్తయ్యే మొబైల్​ ఫోన్స్, హెడ్​సెట్స్​, స్మార్ట్​వాచ్​, ఇతర పరికరాలకు ఈ పొడిగింపు వర్తిస్తుంది."

- హానర్ ఇండియా ప్రకటన

ఒప్పో కూడా మార్చి 23 తర్వాత వారంటీ పూర్తయ్యే తమ ఉత్పత్తులకు గడువును పెంచింది.

రియల్​మీ మార్చ్​ 20 నుంచి ఏప్రిల్​ 30 మధ్య వారంటీ ముగిసే గాడ్జెట్లకు మే 31 వరకు సమయం ఇచ్చింది.

మార్చి, ఏప్రిల్​లో వారంటీ ముగిసే ఉత్పత్తులకు లాక్​డౌన్ తర్వాత రెండు నెలల సమయం ఇచ్చింది. ఏవైనా సందేహాలు ఉంటే వాట్సాప్​, లైవ్ చాట్ సపోర్ట్​ ద్వారా వినియోగదారులకు అందుబాటులో ఉంటామని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి:వాట్సాప్​లో కొత్త ఫీచర్​- ఫార్వర్డ్​ మెసేజ్​లకు సెర్చ్ ఆప్షన్

ABOUT THE AUTHOR

...view details