తెలంగాణ

telangana

ETV Bharat / business

కేంద్రం ఉద్దీపనలతో.. దలాల్​ స్ట్రీట్​లో బుల్​ జోరు - నిఫ్టీ

దేశీయ కంపెనీలకు కార్పొరేట్​ సుంకాలు తగ్గిస్తూ.. కేంద్రం తీసుకువచ్చిన ఉద్దీపనలతో స్టాక్​ మార్కెట్లు నేడు భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 1,921 పాయింట్లు బలపడింది. నిఫ్టీ 570 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ చరిత్రలో ఇదే అత్యధిక ఇంట్రాడే వృద్ధి.

స్టాక్​ మార్కెట్లు

By

Published : Sep 20, 2019, 4:52 PM IST

Updated : Oct 1, 2019, 8:31 AM IST

స్టాక్​ మార్కెట్లు నేడు రికార్డు స్థాయి లాభాలతో ముగిశాయి. వృద్ధికి ఊతమందించే దిశగా కార్పొరేట్​ సుంకాలు తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ ప్రకటించిన నేపథ్యంలో ఒక్కసారిగా కొనుగోళ్ల పర్వం మొదలైంది. వీటికి తోడు జీఎస్టీ మండలి సమావేశంలో మరిన్ని పన్నుల తగ్గింపు ఆశలు మదుపరుల సెంటిమెంట్​ను బలపరిచాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ ఏకంగా 1,921 పాయింట్లు ఎగబాకింది. చివరకు 38,014 వద్ద స్థిరపడింది. గత పదేళ్ళలో సెన్సెక్స్​ ఒక్కరోజు లాభాలు ఈ స్థాయిలో ఉండటం ఇదే ప్రథమం. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 570 పాయింట్లు బలపడింది. నిఫ్టీ చరిత్రలో ఒక్క రోజులో ఇన్ని పాయింట్లు పెరగటం ఇదే ప్రథమం. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 11,274 వద్దకు చేరింది.

ఇంట్రాడే సాగిందిలా

సెన్సెక్స్​ 38,378 పాయింట్ల గరిష్ఠాన్ని తాకగా.. 36,086 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.
నిఫ్టీ నేడు 11,382 పాయింట్ల అత్యధిక స్థాయి.. 10,691 పాయింట్ల అత్యల్ప స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

హీరో మోటార్స్​ 12.52 శాతం, మారుతీ 10.89 శాతం, ఇండస్​ఇండ్​ బ్యాంక్​ 10.74 శాతం, బజాజ్​ ఫినాన్స్​ 10.19 శాతం, ఎస్​బీఐ 10.09 శాతం, ఎం&ఎం 9.53 శాతం లాభాలను నమోదు చేశాయి.

పవర్​ గ్రిడ్​ 2.39 శాతం, ఇన్ఫోసిస్​ 1.94 శాతం, టీసీఎస్​ 1.74 శాతం, ఎన్​టీపీసీ 1.52 శాతం, టెక్​ మహీంద్రా 0.35 శాతం నష్టాలతో ముగిశాయి.

రూపాయి, ముడి చమురు

రూపాయి నేడు 29 పైసలు బలపడింది. డాలర్​తో పోలిస్తే 71.04 వద్దకు చేరింది.

ముడి చమురు ధరల సూచీ-బ్రెంట్​ 0.64 శాతం పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర 64.84కు చేరింది.

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లయిన షాంఘై సూచీ, జపాన్ సూచీ, దక్షిణ కొరియా సూచీలు లాభాలతో ముగిశాయి. హాంకాంగ్ సూచీ నష్టాలతో ముగిసింది.

ఇదీ చూడండి: కార్పొరేట్​ పన్ను తగ్గింపు చారిత్రక నిర్ణయం: మోదీ

Last Updated : Oct 1, 2019, 8:31 AM IST

ABOUT THE AUTHOR

...view details