స్టాక్ మార్కెట్లు నేడు నష్టాలతో ముగిశాయి. ఐటీ రంగ షేర్లు కుదేలవ్వడం నేటి నష్టాలకు కారణంగా తెలుస్తోంది. దీనికి తోడు.. దేశ ఆర్థిక వృద్ధి ఆందోళనకరంగా ఉందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ చేసిన ప్రకటన మదుపరుల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఫలితంగా అమ్మకాల ఒత్తిడికి లోనయిన సూచీలు చివరకు నష్టాలతో ముగిశాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 181 పాయింట్లు క్షీణించింది.. చివరకు 41,461 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 51 పాయింట్ల స్వల్ప నష్టంతో 12,212 వద్దకు చేరింది.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 41,703 పాయింట్ల గరిష్ఠాన్ని తాకగా.. 41,423 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.
నిఫ్టీ నేడు 12,284 పాయింట్ల అత్యధిక స్థాయి.. 12,202 పాయింట్ల అత్యల్ప స్థాయిల మధ్య కదలాడింది.