అమెరికా-చైనా వాణిజ్య యుద్ధానికి తెరపడుతుందన్న ఆశలతో స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ముగిశాయి. లోహ, వాహన, బ్యాంకింగ్ రంగ షేర్ల సానుకూలత నేటి లాభాలకు మరో కారణం.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 292 పాయింట్లు పుంజుకుంది. చివరకు 38,506 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 87 పాయింట్లు లాభపడి..11,428 వద్దకు చేరింది.
ఇంట్రాడే సాగిందిలా
సెన్సెక్స్ 38,635 పాయింట్ల గరిష్ఠాన్ని తాకగా.. 38,238 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.
నిఫ్టీ నేడు 11,462 పాయింట్ల అత్యధిక స్థాయి.. 11,342 పాయింట్ల అత్యల్ప స్థాయిల మధ్య కదలాడింది.