తెలంగాణ

telangana

ETV Bharat / business

వృద్ధి భయాలతో స్టాక్​ మార్కెట్ల బెంబేలు - నిప్టీ

వృద్ధి మందగమనం, ఆర్థిక మాంద్యం వస్తుందన్న ఆందోళనల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు నేడు నష్టాలు నమోదు చేశాయి. సెన్సెక్స్​ 74 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 37 పాయింట్లు క్షీణించింది. ఎస్​ బ్యాంక్​ అత్యధికంగా 7.11 శాతం నష్టపోయింది.

స్టాక్ మార్కెట్లు

By

Published : Aug 20, 2019, 4:29 PM IST

Updated : Sep 27, 2019, 4:20 PM IST

స్టాక్ మార్కెట్లు నేడు నష్టాలతో ముగిశాయి. వృద్ధి మందగమనం, ఆర్థిక మాంద్యం భయాలతో బ్యాంకింగ్​ రంగ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి.
బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 74 పాయింట్లు కోల్పోయింది. చివరకు 37,328 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 37 పాయింట్ల నష్టంతో 11,017 వద్ద స్థిరపడింది.

ఇంట్రాడే సాగిందిలా

నేటి సెషన్ మొత్తం తీవ్ర ఆటుపోట్ల మధ్య సాగింది. సెన్సెక్స్​ 37,512 పాయింట్ల గరిష్ఠాన్ని తాకగా.. 37,220 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.
నిఫ్టీ నేడు 11,076 పాయింట్ల అత్యధిక స్థాయి.. 10,985 పాయింట్ల అత్యల్ప స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

మారుతీ 3.75 శాతం, టాటా మోటార్స్ 2.53 శాతం, ఇన్ఫోసిస్​ 1.94 శాతం, హెచ్​సీఎల్​ టెక్​ 1.87 శాతం, ఎం&ఎం 1.56 శాతం, హీరో మోటార్స్ 1.18 శాతం లాభాలను నమోదు చేశాయి.

ఎస్​ బ్యాంకు అత్యధికంగా 7.11 శాతం నష్టపోయింది. ఇండస్ ​ఇండ్​ బ్యాంకు 2.36 శాతం, ఐటీసీ 2.01 శాతం, యాక్సిస్ బ్యాంకు 1.64 శాతం, ఐసీఐసీఐ బ్యాంకు 1.48 శాతం, వేదాంత 1.35 శాతం నష్టాలు మూటగట్టుకున్నాయి.

ఇదీ చూడండి: ఫేస్​బుక్​ ఖాతాకు ఆధార్​ అనుసంధానం తప్పదా?

Last Updated : Sep 27, 2019, 4:20 PM IST

ABOUT THE AUTHOR

...view details