స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో కొనసాగుతున్నాయి. బ్యాంకింగ్, ఐటీ రంగాల్లోని పలు షేర్లు సానుకూలంగా ట్రేడవుతూ లాభాలకు దన్నుగా నిలుస్తున్నాయి. వీటికి తోడు అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతుండటం మార్కెట్లకు కలిసివస్తున్న అంశమని నిపుణులు చెబుతున్నారు.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 148 పాయింట్లకు పైగా వృద్ధితో.. ప్రస్తుతం 41,264 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 41 పాయింట్లకు పైగా లాభంతో..12,148 వద్ద కొనసాగుతోంది.
లాభనష్టాల్లోనివివే..
2019-20 మూడో త్రైమాసికంలో ఎల్&టీ, యాక్సిస్ బ్యాంక్లు మంచి లాభాలను ఆర్జించాయి. ఈ నేపథ్యంలో ఆయా సంస్థల షేర్లు నేడు భారీగా పుంజుకుంటున్నాయి. ఓఎన్జీసీ, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్, భారతీ ఎయిర్టెల్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
టెక్ మహీంద్రా, పవర్ గ్రిడ్, ఏషియన్ పెయింట్స్, ఇండస్ఇండ్ బ్యాంక్ హెచ్యూఎల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.